Rajamouli: చత్రపతి సినిమా విడుదలపై స్పందించిన రాజమౌళి!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం చత్రపతి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ప్రభాస్ కెరియర్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి.మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీమేక్ చేశారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఈ సినిమా బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే రాజమౌళి ఒక వీడియో ద్వారా చత్రపతి సినిమా గురించి మాట్లాడుతూ… చత్రపతి సినిమా తనకి ఎప్పుడు ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీమేక్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించానని తెలిపారు. ఇక ఈ సినిమాను ఫిలిం ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వివి వినాయక్ చేస్తున్నారని తెలిసి సంతోషించానని తెలిపారు.

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో మంచి ప్రేక్షక ఆదరణ ఉన్న నటుడు ఆయనకు చత్రపతి సినిమా కరెక్ట్ గా సరిపోతుందని ఈ సినిమాని ప్రతి ఒక్కరూ కూడా థియేటర్లోనే చూడండి అంటూ రాజమౌళి ఈ సందర్భంగా చత్రపతి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ కు ఎంతో మంచి సక్సెస్ అందించిన ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus