Rajamouli, Kalki: డార్లింగ్ లుక్ అదిరిపోయింది.. రాజమౌళి ట్వీట్ వైరల్!

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాజమౌళి తాజాగా ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం కల్కి 2989 ఏడీ.

ఈ సినిమా టైటిల్ అలాగే గ్లింప్స్ కామిక్ కాన్ ఈవెంట్లో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కనుక చూస్తుంటే అచ్చం హాలీవుడ్ సినిమాలు తలపిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దర్శకుడు వీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు.

గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్తుపై సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టమైన పని కానీ మీరు ఆ సాహసం చేసి సాధ్యమని నిరూపించారు. ఇందులో డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిపోయిందని తెలిపారు. ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది అదే రిలీజ్ డేట్ అంటూ రాజమౌళి ఈ గ్లింప్ వీడియో పై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే రిలీజ్ డేట్ మాత్రమే మిగిలి ఉంది అంటూ రాజమౌళి ట్వీట్ చేయడంతో రిలీజ్ డేట్ గురించి మీరే అడగాలి జక్కన్న అంటూ కొందరు ఈ ట్వీట్ పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ వంటి స్టార్ సెలబ్రెటీలు నటిస్తున్న సంగతి తెలిసిందే.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus