Mahesh Babu: ఆ రేంజ్ లో మహేష్ బాబు క్రేజ్ పెరగనుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో మరో సినిమాలో ఈ స్టార్ హీరో నటిస్తున్నారు. ఈ ఏడాదే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ కానుండగా ఈ ఏడాది జూన్ నుంచి మహేష్ రాజమౌళి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

రికార్డ్ రేటుకు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు విడుదలైన తర్వాత మహేష్ బాబు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరగనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబుకు తిరుగులేదని ఘట్టమనేని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. బాహుబలి1, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల ఫలితాలతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జక్కన్న పేరు మారుమ్రోగుతోంది.

రాజమౌళి సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా ఆ వార్త క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతోంది. శాటిలైట్, డిజిటల్ హక్కుల విషయంలో, ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న మూవీ ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ సరైన కథలను ఎంచుకోవడంతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మరికొన్ని సంవత్సరాల పాటు మహేష్ బాబు వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంటుంది. జక్కన్న సినిమాకు మహేష్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోనున్నారు. దాదాపు పదేళ్ల క్రితమే ఈ కాంబోలో సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమై త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus