Rajamouli Dance: తారక్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకుని.. స్టెప్పులేసి అదరగొట్టి!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రిలీజ్‌ అయ్యి మంచి విజయం సాధించాక రాజమౌళి ‘నాటు నాటు’ స్టెప్‌ వేయాలి, వేస్తారు అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తారక్‌ అన్నాడు గుర్తుందా? దానికి రాజమౌళి కూడా యస్‌, నేను రెడీ అని కూడా అన్నారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ రాజమౌళి పాటకు స్టెప్పులేశారు. అది కూడా ఇంటర్వ్యూ చేసిన అనిల్‌ రావిపూడితో కలసి. ‘ఆర్ఆర్ఆర్‌’ విజయాన్ని పురస్కరించుకుని దిల్‌ రాజు ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌కి పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఇదంతా జరిగింది.

‘ఆర్ఆర్ఆర్‌’ సాధించిన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి దిల్‌ రాజు సోమవారం రాత్రి ఆ సినిమా ప్రముఖులకు, ఇండస్ట్రీలోని సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. దీనికి రాజమౌళి కటుంబం, కీరవాణి కుటుంబం, ఎన్టీఆర్‌ దంపతులు, రామ్‌చరణ్‌ దంపతులు, అనిల్‌ రావిపూడి, కొరటాల శివ… ఇలా చాలామందే హాజరయ్యారు. స్టేజీ మీద రాజమౌళి మాట్లాడుతుంటే అనిల్‌ రావిపూడి వచ్చి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తా అన్నారు అంటూ గుర్తు చేశారు. దీంతో అందరూ ఎంకరేజ్‌ చేశారు.

ఆ వెంటనే పాట మొదలవ్వడం, నాటు నాటు బీట్‌ రావడం జరిగిపోయాయి. ఇంకేముందు మాట ఇచ్చినట్లుగా రాజమౌళి స్టెప్పులకు సిద్ధమైపోయారు. అయితే ఆ పాటకు ఇద్దరు కలసి డ్యాన్స్‌ వేస్తేనే కిక్‌. అందుకే ఆ ఇంటర్వ్యూ చేసిన అనిల్‌ రావిపూడితో కలిసే ఆ స్టెప్పేశారు. ‘నాటు నాటు’ పాటకు తారక్‌, చరణ్‌తో 17 టేకులు వేయించిన రాజమౌళి, ఇక్కడ మాత్రం ఒక్క టేక్‌లో ఓకే చేయించుకున్నారు. దాంతో ఆ ప్రదేశం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

రాజమౌళి డ్యాన్స్‌ను చూస్తే దిల్‌ రాజు, కొరటాల శివ, కీరవాణి, రమా రాజమౌళి తెగ మురిసిపోయారు. ఎన్టీఆర్‌, తారక్‌ అయితే చప్పట్ల మోత మోగించారు. సినిమా ఇచ్చిన విజయం ఎంత ఊపును తీసుకొచ్చిందో రాజమౌళి డ్యాన్స్‌ చూస్తే తెలిసిపోతుంది. మీరు కావాలంటే ఆ వీడియో చూడండి రాజమౌళి ఎలా దుమ్ము దులిపారో.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus