ఒక వ్యక్తి సహాయ దర్శకుడిగా మొదలు పెట్టి, తన తొలి సినిమా దర్శకేంద్రూడి పర్యవేక్షణలో తెరకెక్కించి, అటుపై హిట్స్ పై హిట్స్ కొట్టడమే కాకుండా ఇప్పటివరకూ ఓటమి ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ టాప్ దర్శకుడిగా చెలామణీ అవుతున్నాడు. అయితే మగధీర సినిమాతో చెర్రీకి లైఫ్ ఇచ్చినా, బాహుబలితో టాలీవుడ్ సినిమా స్థాయిని భారతదేశ చలనచిత్ర చరిత్ర స్థాయికి తీసుకెళ్లినా అది ఒక్క జక్కన్నకే సొంతం. ఇక తాజాగా రాజమౌళి తీసిన బాహుబలి ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు సాధించడమే కాకుండా, ఈ సంవత్సరపు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు సైతం పొందడంతో జక్కన్న కీర్తి పతాక స్థాయికి చేరింది.
ఇదిలా ఉంటే, ఇప్పటికీ ఈ చిత్రం మొదటి భాగం రికార్డుల పరంపర సృష్టించి కలక్షన్ల ప్రభంజనం సృష్టించగా, మరో పక్క రెండో భాగంలో ఏమవుతుందా అని ఆన్‌లైన్ సైట్స్ లో రచ్చ రాంబోలా జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే…బాహుబలి1లో చూపించిన ప్రకారం అమరేంద్ర బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప చివరి నిమిషంలో అతడినే వెన్నుపోటు పొడుస్తాడు…ఎందుకు అలా చేస్తాడు?. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా తరువాత అందరూ రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టిఆర్ తో సినిమా, తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ తో (ఈగ2) సినిమాలు చేస్తారని కొంతకాలం సినీ ఇండస్ట్రీలో వార్త హల్‌చల్ చేసింది. కానీ అవేమి కాకుండా ఇప్పుడు రాజమౌళి బాహుబలి2 తరువాత చెయ్యబోయే విశేషాలు బయటకు వచ్చాయి అవేమిటంటే…రాజమౌళి తండ్రి దర్శకత్వం వహించే “మేరాభారత్ మహాన్” చిత్రానికి క్రియేటీవ్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడట…ఈ చిత్రంలో హీరోగా సన్నిడియోల్ ను అనుకున్నట్లు సమాచారం. మరి బాహుబలితో ఒక్కసారిగా ప్రపంచ స్థాయిని అందుకున్న మన జక్కన్న మేరాభారత్ మహాన్ తో బాలీవుడ్ లో చక్రం తిప్పాలి అని ఆశిద్దాం.