Rajamouli: ఆ హీరోతో సినిమా తీయాలనే జక్కన్న కల నెరవేరడం సాధ్యమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 12 సినిమాలతో విజయాలను అందుకున్న దర్శకధీరుడు రాజమౌళికి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో నటించినా చాలని చాలామంది హీరోలు భావిస్తారు. అయితే రాజమౌళి మాత్రం తన సినీ కెరీర్ లో ఒక్క మూవీ అయినా సూర్యతో చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన సూర్య తన సినీ కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించారు.

పాత్ర కోసం ఎంత కష్టమైనా అనుభవించే సూర్య సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం సూర్య కార్తీ పేర్లను సైతం మొదట పరిశీలించారని గతంలో వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో మూవీ పూర్తైన తర్వాత సూర్య రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

అయితే రాజమౌళి (Rajamouli) స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కంగువా మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ టైటిల్ కు సంబంధించి అయినా క్లారిటీ వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus