Rajamouli: అలా చేస్తే మాత్రమే జక్కన్న ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తున్నా ఆయన సినిమాలు వేగంగా తెరకెక్కకపోవడంపై అభిమానుల నుంచి ఒకింత నిరాశ వ్యక్తమవుతోంది. రాజమౌళి ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా అదే సమయంలో నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తుండటం గమనార్హం. రాజమౌళి ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ ను ప్రకటించడం లేదు. రాజమౌళి ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ను ఫాలో అవ్వాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ ఇప్పటికే తర్వాత ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించేశారు. తర్వాత సినిమాల స్క్రిప్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రాజెక్ట్ ల విషయంలో ఆలస్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమౌళి మాత్రం ఒక్కో సినిమాకు మూడు నుంచి మూడున్నరేళ్ల సమయం తీసుకుంటున్నారు. రాజమౌళి ఒక్కో సినిమాకు ఇంత సమయం తీసుకోవడంతో ఆయన రాబోయే పదేళ్లలో కేవలం రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే తీసే ఛాన్స్ అయితే ఉంటుంది.

రాజమౌళి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. అమర శిల్పి జక్కన్నలా రాజమౌళి సినిమాలు చెక్కుతారని ఇండస్ట్రీలో విమర్శ ఉంది. ఆడియన్స్ కూడా రాజమౌళి సినిమాలు అంటే లేట్ అవుతాయని భావిస్తారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లి థియేటర్లలో రిలీజ్ కావాలంటే 2025 సంవత్సరం వరకు ఆగాల్సిందే.

2025లో విడుదలయ్యే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుండగా త్వరలో ఈ సినిమా షూట్ కు సంబంధించి అప్ డేట్ రానుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus