దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు 12 చిత్రాలను తెరకెక్కించారు. అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. కలక్షన్ల పరంగా తాను నెలకొల్పిన రికార్డులను తానే తిరగరాస్తున్నారు. ఈ సందర్భంగా అతని సినిమాల కలక్షన్స్ వివరాలు…..
1. స్టూడెంట్ నంబర్ 1మూడు కోట్లతో నిర్మితమైన ఈ స్టూడెంట్ నంబర్ 1 ని నాలుగు కోట్లకు అమ్మగా 12 కోట్లు వసూలు చేసింది.
2. సింహాద్రి ఎనిమిది కోట్లతో రూపుదిద్దుకున్న సింహాద్రిని 13 కోట్లకు విక్రయించారు. మొత్తంగా 26 కోట్లు కోళ్ల గొట్టింది.
3 . సై 5 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సై 7 కోట్లకు విక్రయించగా 9.5 కోట్లు వచ్చాయి.
8. మర్యాద రామన్న14 కోట్లతో నిర్మితమైన మర్యాద రామన్న 20 కోట్లకు అమ్ముడుపోయింది. 29 కోట్లు వసూలు చేసింది.
9: ఈగ అత్యధిక గ్రాఫిక్స్ గల ఈగ 26 కోట్లతో నిర్మితమై 32 కోట్లకు విక్రయించారు. 42.30 కోట్లు కొల్లగొట్టింది.
10. బాహుబలి బిగినింగ్ 136 కోట్లతో నిర్మించిన బాహుబలి బిగినింగ్ మూవీని 191 కోట్లకు అమ్మారు. ఇది 602 కోట్లు వసూలు చేసింది.
11 . బాహుబలి 2
ప్రభాస్ వీరోచితంగా నటించిన బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మితమై వంద రోజుల్లో 1917 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది..
ఆర్.ఆర్.ఆర్
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.608.65 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1135(కరెక్టెడ్) కోట్లు కొల్లగొట్టింది.తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.