‘బాహుబలి'(సిరీస్) తో రాజమౌళి సత్తా ఏంటి అన్నది ప్రపంచం మొత్తానికి తెలిసింది.ఆ ఒక్క సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా అమాంతం పెరిగింది. వరుసగా తెలుగులో పాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ధైర్యాన్ని ఇచ్చింది రాజమౌళి ‘బాహుబలి’. 5 ఏళ్ళ తర్వాత ఆ మూవీ రికార్డులను మళ్ళీ రాజమౌళినే బ్రేక్ చేసాడు. ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ఇప్పటికే రూ.1000 కోట్లు గ్రాస్ వసూళ్ళను రాబట్టి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఇక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రాజమౌళి తన తర్వాతి సినిమా పై కూడా ఫోకస్ పెట్టాడు. రాజమౌళి తన తర్వాతి సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్నట్టు పదే పదే చెబుతూనే ఉన్నాడు. ‘దుర్గా ఆర్ట్స్’ అధినేత కె.ఎల్. నారాయణ ఈ మూవీని నిర్మించనున్నాడు. గతంలో ఈయన ‘సంతోషం’ వంటి హిట్ సినిమాల్ని నిర్మించాడు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబు తో సినిమా పక్కా అని చెప్పిన రాజమౌళి.. మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని కూడా తెలియజేశారు.
కరోనా లాక్ డౌన్ టైములో మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారిని ఖాళీగా ఉంచకుండా.. తర్వాతి సినిమా పై వర్క్ చేయమని చెప్పాను. అలా ఆయన మహేష్ కోసం రెండు కథలు సిద్ధం చేశారు. అందులో మహేష్ కు ఏది నచ్చితే.. ఆ కథతో స్క్రిప్ట్ పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్ళిపోవడమే..! అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా పై స్పందిస్తూ ఓ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ డ్రామాని సిద్ధం చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని రూ.800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు అని కూడా చెప్పుకొచ్చారు.