బాహుబలి గురించి ఇంటరెస్టింగ్ విషయాలు బయటపెట్టిన జక్కన్న

  • April 17, 2017 / 08:40 AM IST

బాహుబలి… ఈ పదం వింటే రికార్డులు సైతం సాహో అంటూ కధం తొక్కుతాయి…ఈ పేరు వినగానే బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచుద్డి…ఈ నామ స్మరనం ప్రపంచ దేశాలను ఒక్కసారిగా మానవైపు చూసేలా చేసింది…అలాంటి బాహుబలిని చెక్కిన అమర శిల్పి, మన టాలీవుడ్ ‘జక్కన్న’ తన తొలి బాహుబలి గురించి, త్వరలో రాబోతున్న బాహుబలి2 గురించి ఎన్నో విషయాలను మనసు విప్పు పంచుకున్నారు…ఆ విషయ సమాచారం…మీ కోసం సంక్లుప్తంగా…

బాహుబలి2 ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ పై మీ కామెంట్??
చాలా ఆనందంగా ఉంది…మిలియన్…మిలియన్ వ్యూస్ ను అందుకుంటూ…దూసుకుపోతున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ట్రైలర్ క్రెడిట్స్ అంతా… కార్తికేయ ఈ ట్రైలర్స్, వీడియోస్ హెడ్ మరియు వంశీ ట్రైలర్ ని కట్ చేసిన ఎడిటర్ కి దక్కుతుంది…ట్రైలర్ ఎలా చేద్దాం అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు, బాహుబలి ప్రమాణ స్వీకారం సీన్ తో మొదలు పెడితే బావుంటుంది అనే ఆలోచన కార్తికేయ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది…వెంటనే ఒకే చెప్పేసా….

బాహుబలి 3కూడా తీస్తున్నారా??
సినిమా పరంగా బాహుబలి మూడో పార్ట్ తీసే ఆలోచన లేదు….కానీ…బాహుబలి మాత్రం అందరికీ చేరేలా…ఎప్పటికీ మరచిపోని అంశంలా వివిధ రూపాల్లో ప్లాన్ చేస్తున్నాము….నోవెల్స్, ఆనిమేషన్ సీరీస్, ఇలా రకరకాలుగా బాహుబలి బ్రాండ్ ని కొనసాగిస్తూనే ఉంటాం…

బాహుబలి2లో యాక్షన్ సీన్స్ గురించి చెప్తారా??
సహజంగా యాక్షన్ అయినా…పాటలు అయినా…ఏదో టెంపోరరీ గా పెట్టాము, కధ మధ్యలో ఇరికించాం అని కాకుండా, పాటతో, పాటు, యాంక్షన్ తో పాటు ముడిపడి ఉన్న డ్రామా, కధ, ఎమోషన్ ఉంటేనే ఆది సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముతాను…అయితే అదేమీ కి లేకుండా మనం ఎంత రిచ్ గా చూపించాలనే ప్రయత్నం చేసినా అది ఫెయిల్ అవుతుంది.

సెన్సార్ విషయం ఏంటి? సినిమాని సెన్సార్ చేశారా? రిసల్ట్ ఏమిటి?
ఇంకా సెన్సార్ కాలేదు…సెన్సార్ కి అప్లై చేసాము…ఇంకో వారం, పది రోజుల్లో సెన్సార్ కార్యక్రమం పూర్తి అవుతుంది.

అవునా…మరి మీరు ఇంకా సినిమా పై పనిచేస్తూనే ఉన్నారని విన్నాం? అసలైతే సినిమాను నెల ముందు పూర్తి చేసి తరువాత సెన్సార్ కార్యక్రమాలకు పంపిస్తారు కదా??
నవ్వుతూ…అవునా….మీరు అలా చేస్తారా…నేనైతే అలా ఎప్పుడూ చెయ్యలేదు…నా అనుభవంలో సినిమా రెండు మూడు, రోజుల విడుదలకు ముందు కూడా, ఏమైనా మార్పులు ఉంటే చేసిన సంధర్భాలు చాలానే ఉన్నాయి…మయ నిర్మాత నన్ను బయటకు పంపించే వరకూ పని చేస్తూనే ఉంటాను…

తొలి భాగంతోనే రెండో భాగాన్ని సైతం తెరకెక్కించారని వింటున్నాం? నిజమేనా?
అసలైతే అదే ఆలోచనతో అడుగు వేశాం…రెండు కలసి తెరకెక్కించేసి…అప్పుడు విడివిడిగా విడుదల చేద్దాం అని, అయితే అనుకోకుండా మొదటి భాగం తీసేసరికే బడ్జెట్ ప్రాబ్లమ్స్ రావడంతో కుదరలేదు…అయితే ఒక 20-30% రెండో భాగాన్ని కూడా తొలి భాగంతో తెరకెక్కించాం…అందులో ముఖ్యంగా, యుద్ద సన్నివేశాలు…యాక్షన్ సన్నివేశాలనే తొలి భాగంతో కలసి తెరకెక్కించాం..

సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి? దానిపై మీ స్పందన??
సినిమాపై అంచనాలు ఉండడం చాలా మంచిది, వాటి వల్ల నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు…ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తే అంత కసిగా పనిచెయ్యాలి అన్న తపన, పెరుగుతుంది.

బాహుబలి అనేది, ఒక బ్రాండ్ గా మారుతుంది అని ముందే ఎక్స్‌పెక్ట్ చేశారా??
లేదు!!! సినిమా సూపర్ హిట్ అవుతుంది అని తెలుసు, ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఆశపడింది నిజమే..కానీ…ఇంతటి భారీ హిట్ అందుకుని, ఒక బ్రాండ్ గా మారుతుంది అని అయితే అసలు ఊహించనే లేదు…ఇంకా చెప్పాలి అంటే, ప్రేక్షకుడి నుంచి, మీడియా వరకూ అందరి మైండ్ లో చొచ్చుకుపోయిన సినిమా బాహుబలి, ఇప్పటివరకూ నా గురించి, ప్రభాస్ గురించి, ఇంకా రకరకాల రూమర్స్ విన్నాం కానీ, ఎక్కడా సినిమా విషయంలో మాత్రం నెగేటివ్ న్యూస్ వినలేదు….దట్ ఈజ్ బాహుబలి.

సినిమా ఒక్క తెలుగులో తెరకెక్కించబడి….అన్ని బాషల్లో భారీ విజయాన్ని అందుకోవడం అంటే అసాధారణం మీకెలా అనిపిస్తుంది?
లేదు…సినిమాని తెలుగు, మరియు తమిళ్ లో షూట్ చేసి, వివిధ బాషల్లో డబ్ చేశాం….చాలా ఆనందంగా ఉంది…ఇలాంటి అసాధారణ హిట్ అందుకున్నందుకు…

సినిమా పైరసీ పై మీ యాక్షన్ ఏంటి??
పైరసీ అనేది…టోటల్ ఇండియన్ సినిమాని నాశనం చేస్తున్న భూతం…అయితే పైరసీ చేసే వాళ్ళని మనం తప్పు పట్టలేము…ఎందుకంటే…సినిమా, శాటిలయిట్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్, ఇలా మనం రకరకాల బిజినెస్ మోడెల్స్ ని తయారు చేయగలిగాం కానీ…వెబ్ మీడియా ఎంతటి బలమైన ఆయుధమో ఆలోచించి అంచనా వెయ్యడంలో మనం పూర్తిగా విఫలం అయ్యాం అనే చెప్పాలి…అంతేకాకుండా…. నా మొబైల్ లో నాకు నచ్చింది నేను చూడాలి అని అనుకునే వాళ్ళు పైరసీ ని నమ్ముకుంటున్న క్రమంలో, వారిని తృప్తి పరచడానికి మనం కూడా మంచి బిజినెస్ మోడెల్ ను ఇంట్రొడ్యూస్ చేస్తే బావుంటుంది….ఎందుకంటే ఈ పోలీస్ కేస్, గొడవలు, ఇవన్నీ మహా అయితే ఒక 10, 20% మనకు హెల్ప్ చేస్తాయి…అదే మంచి ప్రోసెస్ ఒకటి మనం పెట్టగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అనేది నా ఆలోచన.

తొలి భాగం పాటలు అన్ని బాషల్లో సూపర్ హిట్ అయ్యాయి, రెండో భాగం ఇప్పుడెప్పుడే అందరికీ రీచ్ అవుతున్నాయి?? బాహుబలి2 పాటలపై మీ స్పందన?
తొలి భాగం పాటలు అందరికీ దగ్గర అయ్యింది సినిమా విడుదల తరువాత…సినిమా పాట వినే అప్పుడు కన్నా…తెరపై చూసే సమయంలో ఆ పాటలోని మాధుర్యం అర్ధం అవుతుంది…ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాలకు ఒక పక్కా కమర్షియల్ పాటలను పెట్టే అవకాశం ఉండదు…ప్రతీ పాటలో కధ, ఆ ఎమోషన్ క్యారీ అవుతూనే ఉండాలి.

కట్టప్ప పాత్ర ఇంకా ఉందా??
హా…కట్టప్ప పాత్ర చాలా కీలకం…ఆయన ఈ సినిమా ప్రధాన పాత్రల్లో ఒకడు….ఇంకా చెప్పాలి అంటే… ప్రేక్షకులు ప్రేమించే బాహుబలి పాత్రల్లో కట్టప్ప పాత్ర అత్యంత దగ్గరైన పాత్ర…ఈ సినిమాలో ఆయన పాత్రలో ఇంకా చాలా షేడ్స్ కనిపిస్తాయి…

ఈ తొలి తమిళ సినిమా ఎప్పుడు??
బాహుబలి తమిళ సినిమానే…తమిళ బాషలో కధ రాసుకున్నాం…షూటింగ్ చేశాం…డైలాగ్స్ రాశాము…డైలాగ్స్ గాతాలు గంటలు ప్ర్యాక్టీస్ చేసి మరీ సెట్స్ పై చిత్రీకరించాం….

బాహుబలిపై మీ అంచనాలు ఏంటి? ఇది 1000కోట్ల మార్క్ దాటుంది అని అనుకుంటున్నారా??
కాదు..తెలీదు అని అంటే నేను అబద్దం ఆడుతున్నట్లే…మిమ్మల్ని నా మాటలతో మోసం చేస్తున్నట్లే…సహజంగా మనకు ఆ ఆలోచన ఉంటుంది…అంతకన్నా బాగా ఆడాలి, ఇంకా ఎంతో కలెక్ట్ చెయ్యాలి అని ఆశ ఉంటుంది…కానీ ఆ ఆశ, ఆలోచన ఎంతవరకూ నిజం అవుతుందో చూడాలి మరి.

బాహుబలి1 కన్నా ఎక్కువ వసూళ్లు చేస్తుంది అన్న నమ్మకం ఉందా??
వసూళ్ల విషయం పై కన్నా…సినిమాని తీర్చిదిద్దిన విధానం, సినిమాపై పెట్టిన శ్రమపై పూర్తి నమ్మకం ఉంది…మనవరకూ సినిమాను తీసి, మార్కెట్ చేసి, ప్రేక్షకులకు ఇవ్వగలం….చివరిగా వాళ్లే మన సినిమాని సక్సెస్ చేసి, మనకు డబ్బులు తెచ్చిపేట్టేది…సినిమా విడులా అయ్యిన తరువాత కానీ చెప్పలేం….సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో అని…

చివరిగా సినిమా రన్ టైమ్ ఎంత??
రెండు గంటల యాబై నిమిషాలు….

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus