Rajamouli: మణిరత్నం టాలెంట్ గురించి తెలిసి జక్కన్న షాకయ్యారా?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి చిన్న సినిమాను తెరకెక్కించినా పెద్ద సినిమాను తెరకెక్కించినా ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తారని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. తను అనుకున్న సన్నివేశం అనుకున్న విధంగా వచ్చే వరకు రాజమౌళి అస్సలు రాజీ పడరు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన చిన్న సినిమాలైన మర్యాద రామన్న, ఈగ సినిమాలు సైతం ఎక్కువరోజులు షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. అయితే మణిరత్నం టాలెంట్ గురించి తెలిసి జక్కన్న ఆశ్చర్యపోయారని సమాచారం.

పొన్నియన్ సెల్వన్1, పొన్నియన్ సెల్వన్2 సినిమాలను మణిరత్నం కేవలం 150 రోజులలో షూట్ చేశారని తెలిసి జక్కన్న ఆశ్చర్యానికి గురయ్యారని బోగట్టా. ప్రముఖ కోలీవుడ్ నటులలో ఒకరైన జయం రవి ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. పొన్నియన్ సెల్వన్ కు సంబంధించిన విషయాలను రాజమౌళి అడిగి తెలుసుకున్నారని జయంరవి చెప్పుకొచ్చారు. భారీ సినిమా అయిన పొన్నియన్ సెల్వన్ రెండు భాగాల షూటింగ్ ను అంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ఎలా సాధ్యమైందని ఆయన మణిరత్నంను అడిగారని జయంరవి కామెంట్లు చేశారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా పొన్నియన్ సెల్వన్ తెరకెక్కింది. ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా తమిళనాడులో రికార్డు స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

బడ్జెట్ కు అనుగుణంగా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. పొన్నియన్ సెల్వన్ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తుండటం గమనార్హం. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటులే ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus