‘SSMB 29’ : ప్రియాంక చోప్రాపై గుర్రుగా ఉన్న జక్కన్న.. కారణం?

రాజమౌళి  (S. S. Rajamouli) సినిమా అంటే.. హీరో, హీరోయిన్లతో పాటు యూనిట్ మొత్తం ఆయన రూల్స్ పాటించడం తప్పనిసరి. ఎంతటి స్టార్స్ అయినా సరే రాజమౌళి నిబంధనలకు తగ్గాల్సిందే. మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఇందుకు సిద్దపడే.. సినిమా చేస్తున్నాడు. ఎక్కడా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడటం లేదు. మీడియా ముందుకు కూడా వెళ్లడం లేదు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా.. ఈ ప్రాజెక్టు (SSMB 29) విషయంలో గోప్యంగా వ్యవహరిస్తున్నారు.

SSMB 29

Rajamouli Serious on Priyanka Chopra (1)

కానీ ఇందులో మరో కీలక పాత్ర చేస్తున్న ప్రియాంక చోప్రా  (Priyanka Chopra) మాత్రం.. రాజమౌళి రూల్స్ ని అసలు పాటించడం లేదు అనేది ఇన్సైడ్ టాక్. షూటింగ్ టైంలోనే కాదు మొదటి నుండి ఇంతేనట. విషయంలోకి వెళితే.. ఈ ప్రాజెక్టుకి లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చింది ప్రియాంక. ఆమె ఈ ప్రాజెక్టులో భాగం అయినట్టు రాజమౌళి అండ్ టీం కన్ఫర్మ్ చేసింది లేదు. మరోపక్క ఆమె ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేసే ముందు కూడా..

దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ బయటకు వెళ్ళకూడదు అని రాజమౌళి కండిషన్ పెట్టారు. అగ్రిమెంట్లో సైన్ చేయించుకున్నారు. కానీ ప్రియాంక మాత్రం హైదరాబాద్లో చాలా ప్లేసెస్ కి తిరిగేసి.. ఈ ప్రాజెక్టులో ఆమె కన్ఫర్మ్ అయిపోయినట్టు పరోక్షంగా రివీల్ చేసింది. తర్వాత మహేష్ బాబు పెట్టిన ఓ ట్వీట్ కి కూడా రిప్లైలు ఇస్తూ ఆ విషయాన్ని గుర్తు చేసింది.

అలాగే ఇటీవల ఓ షెడ్యూల్ జరిగింది. దానికి సంబంధించిన చాలా ఫోటోలు ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవన్నీ రాజమౌళికి తెలిసినా ఏమీ అనలేకపోతున్నట్టు తెలుస్తుంది. ఎంతైనా ఆమె గ్లోబల్ బ్యూటీ కదా. మరో 2 షెడ్యూల్స్ ప్రియాంకతో చేయాల్సి ఉందట. కానీ ఇప్పుడు ఆమె విదేశాలకి వెళ్ళిపోయినట్టు టాక్.

పూరీ ఇక హైదరాబాద్లోనే అట.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus