Rajamouli: ‘బాహుబలి’ తర్వాత ఆర్ఎఫ్‌సీకి వెళ్తున్న రాజమౌళి.. ఎందుకంటే?

  • September 13, 2024 / 10:46 PM IST

‘బాహుబలి’ (Baahubali )  సినిమా అంటే మనకు హీరోలు, దర్శకుడు కాకుండా మనకు ఠక్కున గుర్తొచ్చేవి సెట్స్‌, గ్రాఫిక్స్‌. రెండో విషయంలో రాజమౌళి (S. S. Rajamouli)  అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చారు కానీ.. తొలి విషయంలో ఆయన నమ్ముకున్నది రామోజీ ఫిల్మ్‌ సిటీనే. అక్కడే రాజమౌళి షూటింగ్‌ చేశారు. వివిధ సెట్స్‌ రూపొందించి దాదాపు షూటింగ్‌ అంతా అక్కడే పూర్తి చేశారు. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్‌ సిటీకి భారీ మొత్తంలోనే డబ్బులు చెల్లించారని వార్తలొచ్చాయి. అయితే, అక్కడే ఓ చిన్న పుకారు బయటకు వచ్చింది.

Rajamouli

అదే ఇక రాజమౌళి ఆర్‌ఎఫ్‌సీకి వెళ్లరు అని. ఎందుకు, ఏంటి అనే వివరాలు ఇప్పుడు అప్రస్తుతం, సరైన విషయం కాదు కానీ.. ఇప్పుడు విషయం అయితే మాత్రం ఆయన తిరిగి ఆర్‌ఎఫ్‌సీకి వెళ్తున్నారట. అదేంటి తిరిగి అనుకుంటున్నారా? రాజమౌళి గత సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ చేయలేదు అని టాక్‌. ఏదో ప్యాచ్‌ వర్క్‌ కోసం తప్ప. అయితే, ఇప్పుడు చేయబోతున్న సినిమా మహేష్‌బాబుది (Mahesh Babu)  కావడం,

ఆయన తన సినిమాలకు ఎక్కువగగా ఆర్‌ఎఫ్‌సీని ప్రిఫర్‌ చేయడం లాంటి అంశాలు, అలాగే లుక్‌, ఇతర సమాచారం లీక్‌ అవ్వకూడదు అంటే ఆ ప్లేసే సరైనది అని భావించడం వల్ల తిరిగి జక్కన్న రామోజీ చిత్రపురికి పయనమవుతున్నారట. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ అయిపోగానే.. మొత్తంగా అక్కడే ఉండి షూటింగ్‌ పూర్తి చేసుకుంటటారు అని చెబుతున్నారు. ఇక ఈ వార్తలో నిజమెంత ఉంది అనే విషయం తేలాల్సి ఉంది. అయితే సినిమాకు త్వరలో కొబ్బరికాయ కొట్టి అధికారికంగా జనవరి నుండి సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తారు అని చెబుతున్నారు.

కాబట్టి ఈ ఏడాది చివరల్లో ఈ సినిమా గురించి, అలాగే రాజమౌళి ఆర్‌ఎఫ్‌సీ వెళ్లడం గురించి తెలుస్తుంది అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పుడు ఆర్‌ఎఫ్‌సీ ‘బాహుబలి’ సెట్‌ ఉన్నట్లుగానే.. మరో కొత్త సెట్‌ తయారవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ఓ వరల్డ్‌ బిల్డింగ్‌ ఉంటుంది అని అంటారు. గత సినిమాల్లో అది ఆయన చేసి చూపించారు కూడా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus