Rajamouli: ఆ హీరోనే గొప్ప అంటున్న రాజమౌళి!

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల ద్వారా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మగధీర, బాహుబలి సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 1000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ పాత్రలకు రాజమౌళి సమానంగా ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలో చరణ్ పై చేయి సాధిస్తే ఎమోషనల్ సీన్స్ విషయంలో తారక్ పై చేయి సాధించేలా సీన్లు ఉన్నాయని బోగట్టా. దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవాలని భావించడం లేదు.

అయితే తాజాగా రాజమౌళికి చరణ్, ఎన్టీఆర్ లో పర్ఫెక్ట్ నటులు ఎవరనే ప్రశ్న ఎదురైంది. అయితే రాజమౌళి ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చారు. తారక్ తనకు చాలా సంవత్సరాల నుంచి తెలుసని ఎన్టీఆర్ కు ఒక సీన్ చెబితే అప్పుడే ఆ సీన్ ను ఊహించుకుంటాడని చెప్పుకొచ్చారు. కథ చెప్పిన సమయం నుంచి ఆ సీన్లను ఎన్టీఆర్ తనలో తాను ఫీల్ అవుతాడని సెట్ లోకి వచ్చేసరికి నిమిషాల్లో కావాల్సింది ఇచ్చేస్తాడని రాజమౌళి అన్నారు.

చరణ్ చాలా క్లీన్ గా వస్తాడని అతను వైట్ పేపర్ లాంటి యాక్టర్ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. చరణ్ ను ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చని ఏది కావాలంటే అది ఇవ్వడంలో చరణ్ ముందుంటాడని జక్కన్న తెలిపారు. చరణ్ డైరెక్టర్ హీరో అని కావాల్సింది పర్ఫెక్ట్ గా ఇస్తారని రాజమౌళి చెప్పుకొచ్చారు. కొన్ని విషయాల్లో తారక్ గొప్ప అయితే మరికొన్ని విషయాల్లో రామ్ చరణ్ గొప్ప అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కానుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus