స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి2 తర్వాత విజువల్ వండర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తున్న రాజమౌళి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సక్సెస్ సీక్రెట్ గురించి జక్కన్న మాట్లాడుతూ తానెప్పుడూ సక్సెస్ ను సొంతం చేసుకున్నానని భావించనని ప్రతి సినిమాను మొదటి సినిమాలానే భావిస్తానని అన్నారు.
తాను ఎంపిక చేసుకున్న కథకు సరైన నటీనటులను ఎంచుకోవడమే బలమని భావిస్తానని జక్కన్న పేర్కొన్నారు. తారక్, చరణ్ రూపంలో మంచి నటులు దొరికారని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ కు హిస్టరీతో సంబంధం ఉండదని రాజమౌళి వెల్లడించారు. సీతారామరాజు, భీమ్ ల ధైర్యాన్ని మాత్రమే ఈ సినిమాలో చూపించామని రాజమౌళి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ వెన్నెముక అని నేను ఏ విధంగా టార్చర్ చేశానో మా నాన్నను అడగాలని రాజమౌళి వెల్లడించారు. అజయ్ దేవగణ్ నుంచే ఈ సినిమా ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరిలో స్పూర్తి నింపే విధంగా అజయ్ దేవగణ్ పాత్ర ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆ అంచనాలకు తగినట్టుగా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!