ఇతర స్టార్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే చాలా విషయాల్లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి భిన్నమనే సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకునే రాజమౌళి చూడటానికి మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. కష్టపడితేనే ఫలితం దక్కుతుందని భావించే వాళ్లలో రాజమౌళి కూడా ఒకరని చెప్పవచ్చు. జక్కన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా జక్కన్న సినిమాల సక్సెస్ కు పరోక్షంగా కారణమవుతున్నారు.
తాజాగా ఒక సందర్భంలో రాజమౌళి తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. స్టూడెంట్ నంబర్1, మర్యాదరామన్న మినహా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మిగతా సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. రాజమౌళి సినిమాలు ముఖ్యంగా కథ వల్లే సక్సెస్ సాధిస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ అందించే అద్భుతమైన కథను అంతకంటే అద్భుతంగా తెరకెక్కించి రాజమౌళి విజయాలు అందుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ముంబై ఈవెంట్ లో జక్కన్న కాంచి అన్నయ్యను తాను స్క్రిప్ట్ డాక్టర్ అని పిలుస్తానని స్క్రిప్ట్ వర్క్ సమయంలో కాంచి అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తాడని చెప్పుకొచ్చారు.
షూటింగ్ సమయంలో ఏ మిస్టేక్ జరిగినా ఆయన చెబుతాడని జక్కన్న తెలిపారు. కాంచి తన ప్రతి సినిమాకు పని చేస్తాడని ఆయన ఇన్ పుట్స్ సినిమాకు ఎంతగానో యూజ్ అవుతాయని రాజమౌళి తెలిపారు. రాజమౌళి తన వదిన శ్రీవల్లి గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ బాధ్యతలను శ్రీవల్లి సమర్థవంతంగా నిర్వహించారని చెప్పుకొచ్చారు. కీరవాణి మంచి జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి అని ఆర్ఆర్ఆర్ ను చూసి బాహుబలి కంటే ఆర్ఆర్ఆర్ బాగుందని కీరవాణి మెచ్చుకున్నాడని జక్కన్న కామెంట్లు చేశారు.
నా కంటే ఎక్కువగా ఎవరూ కష్టపడరనే అహంభావం నాకు ఉందని అయితే కార్తికేయ నా కంటే ఎక్కువగా కష్టపడుతూ నా అభిప్రాయాన్ని మార్చాడని జక్కన్న చెప్పుకొచ్చారు. జక్కన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!