బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా అయాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేసినప్పుడు నిర్మాత కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి తాను భారీ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నానని, తెలుగులో ఈ సినిమాకు మీరు సమర్పకుడిగా ఉండాలని కోరుకుంటున్నానని అడిగారు. అందుకు మీకు ఓకే అయితే డైరెక్టర్ వచ్చి మీకు కథ వినిపిస్తారు అంటూ చెప్పారు. ఇక ఈ సినిమాకు సమర్పకుడిగా రాజమౌళి ఓకే చెప్పడంతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రాజమౌళిని కలిసి కథ వివరించారు.
డైరెక్టర్ అయాన్ కథ చెప్పే విధానం అంటే అతను సినిమాపై పెంచుకున్న ప్రేమ,తను చూపించే ఎగ్జైట్మెంట్ పై తాను ఎంతగానో ఇంప్రెస్ అయ్యానని రాజమౌళి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే అప్పటివరకు తాను షూట్ చేసిన కొన్ని విజువల్స్ నాకు చూపించారు. ఆ విజువల్స్ చూసి ఇండస్ట్రీకి మరో పిచ్చోడు దొరికాడని అనుకున్నా అంటూ రాజమౌళి ఈ సందర్భంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గురించి వెల్లడించారు.బ్రహ్మాస్త్ర పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది.
ఈ సినిమా కేవలం నేను ఇరవై నిమిషాలు మాత్రమే చూశాను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమా మొత్తం చూసి ఒక సూపర్ హిట్ సినిమా చేతిలో పెట్టుకున్నాడు అంటూ ఈ సినిమాపై కామెంట్లు చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బ్రహ్మాస్త్ర అంటూ ఈ సందర్భంగా రాజమౌళి ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!