Rajamouli: కమల్ హాసన్, రజనీకాంత్.. రాజమౌళి షాకింగ్ ఐడియా!

దర్శక ధీరుడు రాజమౌళి మొట్టమొదటిసారి అంచనాలకు మించి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన RRR సినిమా శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇంతకు ముందు దర్శకుడు రాజమౌళి ఇంటర్వ్యూ ల తో సినిమాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసు కుంటూ వచ్చాడు.

Click Here To Watch NOW

కేవలం ఒక భాషలోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇలా అన్ని రకాల ఇండస్ట్రీలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా కాబట్టి ప్రమోషన్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని రాజమౌళి తన హీరోలద్దరిని తీసుకొని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయడం విశేషం. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఆలోచనలో ఉన్న మరొక మల్టీ స్టారర్ ఐడియా గురించి కూడా చెప్పడం జరిగింది.

 

తమిళం ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని ముఖ్యంగా రజనీకాంత్ కమల్ హాసన్ వంటి వారు కలిసి నటిస్తే కనులవిందుగా ఉంటుంది అని చెప్పాడు. ఎవరో ఒకరు నెగెటివ్ రోల్ లో, మరొకరు పాజిటివ్ పాత్రలో చూపించి సినిమాను వెండి తెర పైకి తీసుకు వస్తే అద్భుతంగా ఉంటుంది అని, తన మైండ్లో ఆ ఆలోచన నిత్యం ఉంటుంది అని అన్నారు.

 

కానీ అలాంటి మల్టీస్టారర్ తీయాలంటే కథ మామూలుగా ఉండకూడదు అని చాలా ఆలోచించాలి అని కూడా అన్నాడు. కేవలం అది తన ఆలోచన మాత్రమే అంటూ వారి గురించి ప్రత్యేకంగా సినిమా ఏది చేయాలని అనుకోలేదు అని కూడా రాజమౌళి తెలియజేశాడు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus