Rajamouli, Mahesh Babu: ఇంకా నెల ఉంది.. ఈ లోపు ఏమైనా తేలుస్తారా జక్కన్నా?

  • July 12, 2024 / 12:36 PM IST

మహేష్‌ బాబు (Mahesh Babu) లైఫ్‌లో అభిమానులకు రెండు ముఖ్యమైన తేదీలు ఉన్నాయి. ఒకటి ఆయన పుట్టిన రోజు ఆగస్టు 9 కాగా, రెండోది ఆయన తండ్రి, దివంగత సూపర్‌ స్టార్‌ కృష్ణ  (Krishna)  పుట్టిన రోజు అయిన మే 31. ఈ రెండు తేదీల్లో మహేష్‌ సినిమా గురించి ఏదో ఒక వార్త, లుక్‌, వీడియో రిలీజ్‌ చేయడం నిర్మాతలు గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఏడాది ఈ రెండింటిలో ఓ డేట్‌ మిస్ అయ్యింది. మరి రెండో డేట్‌కి ఏమైనా న్యూస్‌ ఉంటుందా? ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే చర్చ.

ఆగస్టు 9కి ఇంకా గట్టిగా ఓ నెల కూడా లేదు. దీంతో ఆ రోజు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఏదైనా సమాచారం, ప్రీలుక్‌, లుక్‌, వీడియో ఏమైనా ఇస్తారా? అనే ప్రశ్న మొదలైంది. దానికి కారణం ఇటీవల మహేష్‌ విదేశాల నుండి వచ్చాడు. దీంతో ఆ రోజు కోసం ఏదో ఒక బ్లాస్టింగ్‌ లాంటి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు అంటూ ఓ డిస్కషన్‌ ప్రారంభించారు. ఒక డేట్‌ మిస్ అయింది.. ఇది మిస్‌ అవ్వరు అనేది అభిమానుల ఆశ.

ఇప్పటికే మహేష్‌ బాబుకు సంబంధించి కొన్ని లుక్‌ టెస్ట్‌లు చేశారని వార్తలొచ్చాయి. అందులో ఒకటి రిలీజ్‌ చేసి సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. మరికొందరు అయితే ఆ రోజు వీడియోనే వచ్చేస్తుంది అని ఆశపడుతున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత మహేష్‌ నుండి ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ కానీ, సమాచారం కానీ లేదు. దీంతో ఆగస్టు 9 వైపే అందరి చూపు.

దానికితోడు సినిమా షూటింగ్‌ దశలోనే, ప్రారంభ దశలోనే ఆ సినిమా కథ గురించి, కాన్సెప్ట్‌ గురించి చెప్పేయడం రాజమౌళికి (SS Rajamouli)  అలవాటు. గతంలో చాలా సినిమాలకు ఇదే చేశారు. ఆ లెక్కన ఆ ప్రెస్‌ మీట్‌ అయినా ఆ రోజు పెడతారేమో అనే పాయింట్‌ మరొకటి. మరి వీటిలో ఏది నిజమవుతుంది, లేక మే 31లా మళ్లీ నిరాశపరుస్తారా? అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus