మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (SS Rajamouli) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఎంతవరకు వచ్చాయి, ఇంకెంత ఉంది అనే విషయంలో ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. వచ్చే ఉగాదికి సినిమాకు కొబ్బరికాయ కొడతారు అనేది లేటెస్ట్ టాక్. ఆ రోజు మరికొన్ని విషయాలు సినిమా టీమే చెబుతుంది అని కూడా అంటున్నారు. అయితే రీసెంట్‌గా ఈ విషయంలో మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం ఓ రైటర్‌ను వెతికే పనిలో ఉన్నారట రాజమౌళి.
అదేంటి విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) రాస్తారు కదా అంటారా? ఇక్కడ కావాల్సింది డైలాగ్ రైటర్. సినిమా స్క్రిప్టు ఇప్పటికే లాక్ అయిపోయిందట. అందుకే ఇప్పుడు డైలాగ్ వెర్షన్ పనులు స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. దీంతో ఓ రచయిత కోసం అన్వేషిస్తున్నారట రాజమౌళి. రాజమౌళి సినిమా అంటే సాంకేతిక బృందం పక్కాగా ఉంటుంది. ఆయన ఇంట్లో మనుషులే రాస్తుంటారు. కొందరు సన్నిహితులు కూడా సినిమాలకు పని చేస్తుంటారు. గతంలో రాజమౌళి సినిమాలకు రత్నం, కాంచి రాసేవారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాకు బుర్రా సాయిమాధవ్ పని చేశారు. ఇప్పుడు మహేష్ సినిమా కోసం మాత్రం కొత్త రచయిత వస్తారట. ఓ సన్నివేశంలో చెప్పాలనుకునే విషయాన్ని రాజమౌళి తనదైన శైలిలో టీమ్‌కి చెబుతారట. దాని బట్టి షార్ప్‌గా డైలాగ్స్ సిద్ధం చేయడం టీమ్ పని. విషయాన్ని అర్థం చేసుకుని డైలాగ్స్ రాసే కుర్ర స్మార్ట్ రైటర్ కోసం చూస్తున్నారట. ఈ సినిమాకు కూడా బుర్రా సాయి మాధవ్ పని చేస్తారని టాక్ వచ్చినా… ఆ తర్వాత మళ్లీ ఆ మాట రాలేదు.
ఇప్పుడు కొత్త రచయిత కోసం చూస్తున్నారట. మరి రాజమౌళి ఎవరిని రచయితగా తీసుకుంటారో చూడాలి. కేఎల్ నారాయణ నిర్మాణతగా తెరకెక్కున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమై ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారట. బడ్జెట్, ఇతర విషయాల్లో హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉంటుంది అని అంటున్నారు. సినిమా ఓపెనింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి చాలా విషయాలు చెబుతారట.
భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!