Rajamouli: తండ్రిపై రాజమౌళి అప్సెట్

దర్శకుడు రాజమౌళి ఒక సినిమా చేసే ముందు కథపై ప్రేక్షకులకు చెప్పాలా వద్దా అనే విషయాన్ని ముందుగానే డిసైడ్ చేసుకుంటాడు. బాహుబలి లాంటి కథపై ఎలాంటి క్లారిటీ అయితే అవ్వలేదు. కానీ RRR లాంటి సినిమాపై ముందుగానే మెయిన్ కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే అది చెబితేనే సినిమాకు హైప్ ఉంటుంది. పైగా పాన్ ఇండియా కాబట్టి అందరూ ముందుగానే గూగుల్ సెర్చ్ చేసుకొని ఒక మైండ్ సెట్ తో ఉంటారని జక్కన్న ఆలోచన.

అయితే కెరీర్ లోనే అతిపెద్ద సినిమా అయినటువంటి RRR విషయంలో దర్శకుడు రాజమౌళి ముందుగానే తన టీమ్ తో ఏ విషయంపై కూడా మాట్లాడకూడదని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. అయితే ఇటీవల విజయేంద్రప్రసాద్ మాత్రం అలీతో సరదాగా షోలో జక్కన్నకు నచ్చని విషయాలు చెప్పడంతో అప్సెట్ అయినట్లు సమాచారం. రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ గురించి మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు అజయ్ దేవ్ గన్ లాంటి హీరో ఉన్నప్పటికీ అలియా భట్ రోల్ హైలెట్ అని పదే పదే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

దానికి తోడు RRR అనంతరం హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుందని ముందే లీక్ చేసేశారు. RRR ప్రమోషన్ కు వెళితే జక్కన్నను దాని గురించి అడగకుండా ఉండరు. విసుగు వచ్చే దాకా దానిపైనే ప్రశ్నలు వేయడం ఆపరు. ఇక ఇన్ని లీక్స్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్ కొడుకును కాస్త అప్సెట్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఇక RRR నెక్స్ట్ షెడ్యూల్ ను వచ్చేనెల నుంచి లాక్ డౌన్ లేకుండా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు పూర్తి చేస్తారో..?

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus