Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్ 2’ ప్లానింగ్ చాలా విచిత్రంగా ఉందే..!

రాజ‌మౌళి ఊరికే చెప్పే మాట ఏంటంటే.. ‘దానికి సీక్వెల్ తీస్తా.. దీనికి సీక్వెల్ తీస్తా’ అని..! గతంలో ‘విక్రమార్కుడు’ కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్టు రాజమౌళి తెలిపాడు. ఆ తర్వాత ‘ఈగ 2 ‘ చేస్తాను అన్నాడు.’ బాహుబలి 3 ‘ ఉంటుంది అంటాడు. కానీ ఇప్పటివరకు అతను సీక్వెల్స్ జోలికి పోలేదు. ఇప్పుడు కూడా `ఆర్‌.ఆర్‌.ఆర్`కి సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. రాజమౌళి మాటల గురించి అనుభవం ఉన్న వారికి ఇది ఆసక్తిని కలిగించే విషయం కాదు.

కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ రావడంతో పక్క రాష్ట్రాల్లోని జనాలకి సీక్వెల్ ఎప్పుడు అనే డిస్కషన్లు జరుపుతున్నారు. దీంతో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్… ఆర్‌.ఆర్‌.ఆర్ సీక్వెల్ పై స్పందించారు. దీనిని తీస్తే హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేసి తీయాలి. కాబట్టి హాలీవుడ్లోనే ఈ చిత్రాన్ని తీసి దాన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాక‌పోతే.. ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ కి రాజ‌మౌళి డైరెక్ట్ చేయకుండా ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసే అవ‌కాశం ఉంటుంది అని కూడా ఆయన తెలిపారు.

రాజమౌళి (Rajamouli) పై హాలీవుడ్ టెక్నీషియన్స్ కి నమ్మకం ఉంది. కానీ హాలీవుడ్లో ఈ చిత్రాన్ని మార్కెట్ చేసుకోవాలి అంటే రాజమౌళి కాకుండా అక్కడి స్టార్ డైరెక్టర్ల పేరు ఉంటే బాగుంటుంది అనేది విజయేంద్రప్రసాద్ అభిప్రాయం కావచ్చు. ప్రస్తుతానికైతే రాజమౌళి చూపంతా మహేష్ బాబుతో చేయబోయే సినిమా పైనే ఉంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus