Rajasekhar: ఆ ఆఫర్ ను రాజశేఖర్ అందుకే వదులుకున్నారా?

గోపీచంద్ శ్రీవాస్ కాంబో మూవీలో రాజశేఖర్ ఒక కీలక పాత్రకు ఎంపికై ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ స్థానంలో జగపతిబాబు ఆ పాత్రకు ఎంపిక కావడంతో వైరల్ అయిన వార్తలు నిజమేనని కన్ఫామ్ అయింది. అయితే రాజశేఖర్ ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి రెమ్యునరేషన్ కారణమని బోగట్టా. గోపీచంద్ శ్రీవాస్ కాంబో మూవీలో నటించడానికి రాజశేఖర్ ఏకంగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని సమాచారం.

Click Here To Watch

అయితే నిర్మాతలు మాత్రం 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో రాజశేఖర్ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. రాజశేఖర్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే సినిమా కోసం అంచనాలకు మించి ఖర్చవుతుందని మేకర్స్ భావించినట్టు బోగట్టా. గత కొన్నేళ్లుగా గోపీచంద్ కు సరైన హిట్ లేదు. గోపీచంద్ గత సినిమా సీటీమార్ కు హిట్ టాక్ వచ్చినా ఫుల్ రన్ లో కేవలం 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

పాత్ర నచ్చినా రాజశేఖర్ రెమ్యునరేషన్ వల్లే సినిమాను వదులుకున్నారని తెలిసి ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం మల్టీస్టారర్ మూవీలో నటించడం ఇష్టం లేక రాజశేఖర్ ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి ఉండవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. శేఖర్ సినిమాతో రాజశేఖర్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఆయన ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

గతంలో కూడా రాజశేఖర్ కు భారీ రెమ్యునరేషన్ తో కీలక పాత్రలు పోషించే ఆఫర్లు వచ్చాయని కానీ ఆయన ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. గోపీచంద్ రాజశేఖర్ లను ఒకే స్క్రీన్ పై చూడాలని భావించే వాళ్లకు నిరాశే మిగిలింది. భవిష్యత్తులో గోపీచంద్ రాజశేఖర్ ఒకే సినిమాలో నటిస్తారేమో చూడాల్సి ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus