పెద్ద సినిమాలు కర్చీఫ్ వేసుకున్న రిలీజ్ డేట్లకి చిన్న సినిమాలు వస్తుండడం… ఈ 2022 ఆరంభానికి పెద్ద షాకించ్చే అంశం. జనవరి 7 కి ‘ఆర్.ఆర్.ఆర్’ వస్తుంది అనుకుంటే.. ఆది నటించిన ‘అతిథి దేవో భవ’, రానా హీరోగా రూపొందిన ‘1945’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు కూడా 2022 ఆరంభానికి చేదు ఫలితాన్ని ఇచ్చాయి. ఇప్పుడు వచ్చే నెల ఆరంభానికి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ ని ఫిబ్రవరి 4న విడుదల చెయ్యాలి అనుకున్నారు. కానీ..ఇప్పుడు ఏపిలో 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు రన్ అవ్వాలి అనే నిబంధన అమలు కానుంది. అంతేకాకుండా ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ అయ్యాకే ‘ఆచార్య’ ని విడుదల చెయ్యాలి అనే అగ్రిమెంట్ కూడా ఉంది. కాబట్టి ఫిబ్రవరి 4 కి.. `ఆచార్య` వచ్చే అవకాశాలు లేనే లేవు. దాంతో ఆ డేట్ కు తన సినిమాని దింపాలని రాజశేఖర్ భావిస్తున్నారు.
ఆయన హీరోగా రూపొందిన `శేఖర్` చిత్రం అదే డేట్ కు విడుదల కాబోతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ కు ఇది రీమేక్ గా రూపొందుతుంది. నిజానికి లలిత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అతను తప్పుకోవడం అతని ప్లేస్లో జీవితా రాజశేఖర్ ఆ చిత్రాన్ని పూర్తిచేయడం జరిగింది. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలి అనుకున్నారు అయితే…
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు ఉండడం, థియేటర్లు దొరకడం కూడా కష్టమని భావించి ఫిబ్రవరి 4కి వెళ్లినట్టు తెలుస్తుంది. అదే రోజున రాజశేఖర్ పుట్టిన రోజు కూడా కావడంతో ఈ అవకాశాన్ని టీం మిస్ చేసుకోదలచుకోలేదు.