బిగ్ బాస్ హౌస్ లో డిజె టాస్క్ లో హౌస్ మేట్స్ మద్దతుతో గెలిచి రాజ్ కెప్టెన్ అయినట్లుగా సమాచారం. చంటి, ఆర్జే సూర్య, ఇంకా ఇనయ సుల్తానాలు రాజ్ తో పోటీపడ్డారు. కానీ, హౌస్ మేట్స్ లో అత్యధికంగా రాజ్ కి ఓట్లు వేయడంతో రాజ్ కెప్టెన్ అయ్యాడు. కానీ, ఇప్పుడు రాజ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. రెండోవారం నామినేషన్స్ లో రాజ్ ఉన్నాడు. ఓటింగ్ లో కూడా బోటమ్ లో ఉన్నాడు. డేంజర్ జోన్ లో ఉన్నాడు.
ఒకవేళ ఈవారం ఎలిమినేట్ అయిపోతే కెప్టెన్ గా ఎలిమినేట్ అవుతానని అందుకే నాకు ఓట్ వేయమని హౌస్ మేట్స్ ని అభ్యర్ధించాడు రాజ్. దీంతో హౌస్ మేట్స్ లో మెజారిటీ ఓటింగ్ అనేది రాజ్ కి జరిగింది. నిజానికి బిగ్ బాస్ సిసింద్రీ టాస్క్ లో రాజ్ గెలిచింది ఒకటే ఒక ఛాలెంజ్. అది కూడా ఐస్ క్రీమ్ టాస్క్ లో స్కూప్స్ ని నాలుగు ఒకే కోన్ పైన పెట్టి రూల్ కి విరుద్ధంగా గేమ్ ఆడాడు. టాస్క్ లో రూల్ ని అతిక్రమించి గేమ్ ఆడినా కూడా సంచాలక్ గా ఇనయ సుల్తానా చూసుకోలేకపోయింది.
అంతేకాదు, ఆ తర్వాత మెరీనా వచ్చి అబ్జక్ట్ చేసినా కూడా తిరిగి టాస్క్ ని పెట్టలేదు. అప్పటికే రాజ్ ని ఫస్ట్ రౌండ్ లో విన్నర్ గా డిక్లేర్ చేసింది. నిజానికి ఐస్ క్రీమ్ కోన్ పైన మూడు స్కూప్స్ మాత్రమే పెట్టి మిగతా వాటిని ఎడ్జస్ట్ చేస్తూ రావాలి. కానీ, రాజ్ ఒకేసారి నాలుగు పెట్టాడు. ఇది కనిపెట్టిన మెరీనా సంచాలక్ అయిన ఇనయకి చెప్పింది. కానీ, ఇనయ అప్పటికే రాజ్ గెలిచాడని చెప్పింది. దీంతో మిగతా హౌస్ మేట్స్ ఎవరూ కూడా రాజ్ తర్వాత కోన్స్ పైన స్కూప్స్ ని ఆర్డర్ లో పెట్టలేదు.
కాబట్టి రాజ్ ని విన్నర్ గా డిక్లేర్ చేశానని చెప్పింది ఇనయ. దీంతో రాజ్ కెప్టెన్సీ పోటీదారుల రేస్ లో నిలిచాడు. ఇనయసుల్తానాని, చంటిని, అలాగే సూర్యని సైతం ఓడించి హౌస్ కెప్టెన్ గా గెలిచాడు. మెజారిటీ హౌస్ మేట్స్ మద్దతుతో గెలిచిన రాజ్ కెప్టెన్ గా ఎలా ఉంటాడు అనేది చూడాలి. అలాగే, ఈవారం రాజ్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే, వచ్చేవారం కూడా అతనికి ఇమ్యూనిటీ వచ్చినట్లు అవుతుంది. మరి అతని కెప్టెన్సీలో హౌస్ మేట్స్ ఎలా ఉంటారు అనేది చూడాలి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!