Rajendra Prasad, Bandla Ganesh: కరోనా కాటు…బండ్ల గణేష్‌కి మూడోసారి..రాజేంద్ర ప్రసాద్‌కి తొలిసారి!

కరోనా మూడో వేవ్‌ దేశం మొత్తం చుట్టేస్తోంది. ఎటువైపు చూసినా కరోనా ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. సినిమా పరిశ్రమపై కూడా కరోనా రక్కసి కాటు వేసింది. ఇప్పటికే చాలామంది నటులు కరోనా బారినపడ్డారు. తాజాగా మరో ఇద్దరు నటులు కొవిడ్‌ సోకినట్లు తెలిపారు. అందులో ఒకరికి మూడోసారి కరోనా రాగా, మరొకరికి తొలిసారి. నిర్మాత, నటుడు అయిన బండ్ల గణేష్‌.. తనకు కరోనా సోకినట్లు ట్విటర్‌ ద్వారా తెలిపారు. మరోవైపు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కొవిడ్‌ సోకినట్లు తెలిపారు.

‘‘గత మూడు రోజులుగా దిల్లీలో ఉన్నాను. ఇప్పుడు కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. నా కుటుంబం మొత్తం టెస్ట్‌ చేసుకుంది. వారందరికీ నెగిటివ్‌ వచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. సేఫ్‌గా ఉండండి’’ అంటూ ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌. అలాగే తను కాక్‌టెయిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు బండ్ల గణేష్‌. ఇప్పటివరకు బండ్ల గణేష్‌కు రెండుసార్లు కరోనా సోకింది. ఇది మూడోసారి. రెండోసారి గణేష్‌ చాలా ఇబ్బందిపడ్డారు.

ఇక రాజేంద్ర ప్రసాద్‌కి కరోనా సోకడం ఇది తొలిసారి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో అనేకమంది నటులు కొవిడ్‌ బారిన పడ్డారు. బాలీవుడ్‌లో నిర్మాత ఏక్తా కపూర్, నటులు అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ దద్లానీకి కరోనా సోకింది.

ఇక టాలీవుడ్‌ సంగతి చూస్తే… ప్రముఖ కథానాయకుడు మహేశ్‌ బాబుకు కరోనా సోకింది. ఆయన కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, తమన్‌ కూడా కరోనా బారిన పడ్డారు. వీరితోపాటు తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, అన్ని రకాల ప్రికాషన్స్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus