సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్ సినిమా ఇప్పటికే 500 కోట్ల రూపాయల రేంజ్ లో ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించడంతో పాటు ఫుల్ రన్ లో 700 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షలు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. జైలర్ సక్సెస్ తో నెల్సన్ మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరిగింది.
అయితే రజనీకాంత్ తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ వయస్సులో 20 సంవత్సరాలు చిన్నవారు అయినా ఆయన సన్యాసం తీసుకోవడం వల్లే రజనీకాంత్ ఈ విధంగా చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువమంది రజనీకాంత్ ను ట్రోల్ చేసేలా కామెంట్లు చేస్తున్నారు.
అయితే రజనీకాంత్ సన్యాసం తీసుకున్న వాళ్ల కాళ్లపై పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రజనీకాంత్ ఒక సందర్భంలో సన్యాసం తీసుకున్న వ్యక్తి కాళ్లు మొక్కడం జరిగింది. అయితే అప్పుడు ఎవరూ రజనీకాంత్ పై విమర్శలు చేయలేదు. నెటిజన్లు రజనీకాంత్ పై విమర్శలు చేస్తుండగా అప్పుడు చేస్తే తప్పు కాదు ఇప్పుడు చేస్తే తప్పైందా? అని రజనీని విమర్శించే వాళ్లకు రజనీకాంత్ ఫ్యాన్స్ సమాధానం ఇస్తున్నారు.
రజనీకాంత్ (Rajanikanth) మార్కెట్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. రజనీకాంత్ పై ఇష్టానుసారం విమర్శలు చేయడం సరికాదని ఆయన గొప్పదనం గురించి తెలుసుకుని స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా రజనీకాంత్ కు క్రేజ్ పెరుగుతుండగా రజనీని అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. తెలుగులో జైలర్ సినిమాకు ఇప్పటివరకు 65 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్