Rajinikanth: సూపర్ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

శివ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార, మీనా, కీర్తి సురేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రజినీకాంత్ అభిమానులకు విందు భోజనంలా ఉండనుందని తెలుస్తోంది. తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కమర్షియల్ అంశాలు అన్నీ ఉండేలా తెరకెక్కిన ఈ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తమిళనాడులో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో నిజానిజాల గురించి మేకర్స్ స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. తమిళ వెర్షన్ మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

అయితే స్టార్ హీరో అయిన రజినీకాంత్ సినిమా మూడు వారాల్లో స్ట్రీమింగ్ అయితే కలెక్షన్లపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రజనీకాంత్ వయస్సురిత్యా పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఒక ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే కనీసం 1,000 రూపాయలు ఖర్చు చేయాలి. అన్నాత్తే తక్కువ సమయంలోనే ఓటీటీలో విడుదలైతే కలెక్షన్లపై కచ్చితంగా ఆ ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus