Rajinikanth: తొలిసారి ఓన్ డబ్బింగ్ చెప్పుకోబోతున్న రజినీకాంత్.. ఏ భాషలో అంటే?

  • September 1, 2024 / 12:03 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి (Rajinikanth)  అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అమితాబ్(Amitabh Bachchan) ని మించి పాన్ ఇండియా ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోగా రజినీకాంత్ గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగులో రజినీకాంత్ కి.. ఇక్కడి స్టార్ హీరోలతో సరిసమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నాగార్జున (Nagarjuna)  , వెంకటేష్ (Venkatesh)  వంటి అగ్ర స్టార్ హీరోల సినిమాల కంటే రజినీకాంత్ సినిమాలు ఎక్కువగా కలెక్ట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

Rajinikanth

చాలా కాలం తర్వాత ‘జైలర్’  (Jailer) తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చిన రజినీకాంత్.. ఆ తర్వాత ‘లాల్ సలాం’ (Lal Salaam) తో పెద్దగా మెప్పించలేకపోయారు. అది కూతురు మీద ఉన్న ప్రేమతో చేసిన సినిమా అని అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా.. రజినీకాంత్ ప్రస్తుతం ‘జై భీమ్’ దర్శకుడితో ‘వెట్టాయాన్’  (Vettaiyan)అనే సినిమా చేస్తున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) అనే సినిమా కూడా చేస్తున్నారు. ఇందులో ‘వెట్టాయాన్’ సినిమా తెలుగు వెర్షన్ కోసం రజినీకాంత్ ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్నారట.

సాధారణంగా రజినీకాంత్..కి సింగర్ మను (Mano) ఎక్కువగా డబ్బింగ్ చెబుతుంటారు. ‘కథానాయకుడు’ (Kathanayakudu) అనే సినిమాలో రజనీ పాత్రకి దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరోపక్క ‘బాషా’ (Baashha) ‘పెదరాయుడు’ వంటి సినిమాల్లో రజినీకాంత్ పాత్రకి సాయి కుమార్ (Sai Kumar) కూడా డబ్బింగ్ చెప్పారు. ఎక్కువగా మను చెప్పే డబ్బింగ్ రజినీకాంత్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. మరి కథలో ఎమోషన్ డిమాండ్ చేయడం వల్ల కావచ్చు… తొలిసారి రజినీకాంత్ (Rajinikanth) తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలి భావిస్తున్నట్టు సమాచారం.

 డిజాస్టర్ గా మిగిలిన ‘పురుషోత్తముడు’.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus