1996లో ఎన్నికల్లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకి వ్యతిరేకంగా ప్రచారం చేసి, ఆమె ఓడిపోవడానికి కారణమయ్యానని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాధపడ్డారు. అయినా ఎటువంటి కోపం పెట్టుకోకుండా తన కూతురి పెళ్లి కి వచ్చి ఆశీర్వదించారని వెల్లడించారు. తమిళీయులు అమ్మగా పిలుచుకునే జయలలితకు తమిళ చలనచిత్ర నటీనటుల సంఘం సంతాప సభ ఏర్పాటు చేసింది. జయలలితతో పాటు ప్రముఖ పాత్రికేయులు చో రామస్వామికి కూడా ఒకే వేదికపై సంతాపసభ నిర్వహించారు.
చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నటులు రజనీకాంత్, విశాల్, కార్తీ, గౌతమి, నదియా, వాణిశ్రీ, భారతి, అంబిక, రాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. జయలలితతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. “గురువును మించిన శిష్యులు కొందరే ఉంటారు.. అలాంటి వారిలో జయలలిత ఒకరు. తన గురువు ఎంజీఆర్‌ను ఆమె మించిపోయార”ని రజనీకాంత్ కొనియాడారు. పురుషాధిక్య సమాజంలో పోరాడి గెలిచిన వజ్రమని జయలలితను కీర్తించారు. మరణించి ప్రజల గుండెల్లో కోహినూర్ వజ్రంగా ప్రకాశిస్తున్నారని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.