Rajinikanth: ఆ టైటిల్ తో రజినీ హిట్టు కొడతాడా?

ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో సినిమాలు తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి. నెగిటివ్ టాక్ వచ్చినా కబాలి మూవీ తొలి వీకెండ్ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించింది. అయితే వీకెండ్ తర్వాత కబాలి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. వరుస ఫ్లాపుల వల్ల తెలుగులో రజినీకాంత్ మార్కెట్ తగ్గుతోంది. దీపావళి కానుకగా రజినీకాంత్ నటించిన అన్నాత్తే తెలుగులో పెద్దన్న పేరుతో రిలీజ్ కానుంది.

కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ హీరోగా తెలుగులో పెద్దన్నయ్య సినిమా తెరకెక్కి విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ టైటిల్ ను పోలి ఉన్న టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో రజినీకాంత్ నటిస్తున్న నేపథ్యంలో రజినీకాంత్ హిట్టు కొడతాడో లేదో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. బాలయ్యకు ఫ్లాప్ ఇచ్చిన టైటిల్ రజినీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో నయనతార, కీర్తిసురేష్ నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళికి విడుదలవుతున్న పెద్ద సినిమా ఇదే కావడం గమనార్హం. దీపావళికి ఈ సినిమాతో పాటు మంచిరోజులు వచ్చాయి రిలీజ్ కానుండగా వరుడు కావలెను అక్టోబర్ 29వ తేదీన రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణలో భారీ సంఖ్యలో థియేటర్లలో పెద్దన్న సినిమా రిలీజ్ కానుంది. పెద్దన్న కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని రజినీకాంత్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus