Rajinikanth: ఆ విషయం లో హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్!

బహుభాషా నటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేరళలో జన్మించిన అమలా పాల్ మలయాళ చిత్రం నీలతమరన్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది. కానీ, కోలీవుడ్ చిత్రం “మైనా” తర్వాత అమల అదృష్టం మారిపోయింది. విజయ్, విక్రమ్, సూర్య, ఆర్య, జయం రవి, ధనుష్‌తో సహా బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌తో ఆమె నటించింది. సినిమాలే కాకుండా వ్యక్తిగత సమస్యలు, వివాదాల కారణంగా అమలా పాల్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు అమల మరోసారి వ్యక్తిగత విషయం తెరపైకి వచ్చింది.

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ని అమల పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా ఆమె తన నటను కొనసాగించింది. అయితే ఇది విజయ్ కుటుంబానికి నచ్చలేదు. దీంతో విజయ్, అమల మధ్య వివాదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. నిజానికి అమల – ధనుష్ చాలా సన్నిహితంగా ఉండేవారు. వారిద్దరూ కలిసి నటించిన చిత్రం “వేళైల్లై పట్టదారి”. ఈ సినిమాతోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, పెళ్లికి మించిన బంధానికి కూడా దారి తీసిందని కోలీవుడ్లో తరచూ వినిసిస్తోంది.

ఇప్పుడు మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. తాజాగా కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు సయ్యరు బాలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమలను సూపర్ స్టార్ రజనీకాంత్ హెచ్చరించారని చెప్పుకొచ్చారు. ధనుష్, అమల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ధనుష్ మామ రజనీకాంత్ కు తెలియడంతో, రజనీకాంత్ (Rajinikanth)  అమల ఇంటికి వెళ్లి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడని తెలిపాడు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus