Rajinikanth: 46 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన రజనీకాంత్‌… అంత స్పెషల్‌ ఏంటంటే?

‘జైలర్‌’ సినిమా ఇచ్చిన బ్లాక్‌బస్టర్‌ విజయం ఊపులో ఉన్న తలైవా రజనీకాంత్‌ కొత్త సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్‌ చేసేశారు. మాస్‌ మసాలా సినిమాతో రూ. 600 కోట్ల+ విజయాన్ని అందుకున్న రజనీ… ఇప్పుడు చిన్నపాటి ప్రయోగమే చేస్తున్నారు నఅఇ చెప్పాలి. ‘జై భీమ్‌’ దర్శకుడు టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌ స్పెషల్‌ ప్లేస్‌లో జరుగుతుండటం గమనార్హం. రజనీకాంత్‌కి స్పెషల్‌ ప్లేస్‌ అంటే ఎక్కువమందికి హిమాలయాలు అనే డౌట్‌ వస్తుంది.

కానీ కాదు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలిలో ఈ సినిమా చిత్రీకరణ జరిగుతోంది. సినిమా కోసం రూపొందించిన ప్రత్యేక సెట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ పట్టణానికి రజనీకాంత్‌కి ఆసక్తికరమైన కనెక్షన్‌ ఉంది. ఆ విషయమే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతగా ఆ ఊరుతో ఏం కనెక్షన్‌ ఉంది అనుకుంటున్నారా? రజనీకాంత్‌ 1977వ సంవత్సరంలో ముత్తురామన్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ (Rajinikanth) ‘భువన ఒరు కెల్వి కురి’ అనే సినిమాలో నటించారు.

ఆ సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం తిరునల్వేలి ప్రాంతంలోనే జరిగింది. ఆ తర్వాత రజనీ మళ్లీ ఇప్పటివరకు అక్కడ వెళ్లలేదట. అంటే 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన 170వ సినిమా కోసం వచ్చాడు. దీంతో ఆ ప్రాంతంలో రజనీఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేవట. రోజూ సెట్‌ దగ్గరకు వచ్చి రజనీ కోసం వాళ్లు వెయిట్‌ చేస్తున్నారట. అంతేకాదు ఆ ప్రాంతంతో రజనీకి మరో కనెక్షన్‌ కూడా ఉందట. 1995లో వచ్చిన రజనీకాంత్‌ చిత్రం ‘ముత్తు’ ఈ ప్రాంతంలో రెండు థియేటర్లలో విడుదలైందట.

అంతేకాదు రెండు చోట్లా విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుందట. దీంతో ఈ ప్రాంతం రజనీకాంత్‌కు ప్రత్యేకమైనదేనని అంటున్నారు. కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ 170వ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. 2024 ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తారని సమాచారం. అన్నట్లు ఈ సినిమాలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ హీరోయిన్స్‌ నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ ఫహాద్‌ ఫాజిల్‌, రానా కూడా నటిస్తున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus