Rajinikanth: సూపర్ స్టార్ బిరుదు తలనొప్పిగా మారింది!

Ad not loaded.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి పరిచయం అవసరం లేదు. ఈయన ప్రస్తుతం ఏడు పదులు వయసులో ఉన్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి రజనీకాంత్ త్వరలోనే జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఘనంగా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పలు విషయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈయన సూపర్ స్టార్ అనే బిరుదు గురించి మాట్లాడితే పలు విషయాలు తెలియజేశారు. గత కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ అనే బిరుదు కారణంగా ఎన్ని వివాదాలు ఏర్పడ్డాయో మనకు తెలిసిందే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ తనకు ఈ సూపర్ స్టార్ అనే బిరుదు కారణంగా ఎన్నోసార్లు ఇబ్బందులు వచ్చాయని ఈ బిరుదు తనకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలిపారు.

జైలర్ సినిమాలోని హుకుమ్‌.. పాటలో సూపర్‌ స్టార్‌ అనే పదం వచ్చింది. ఆ పదాన్ని తొలగించాలని డైరెక్టర్‌కి చెప్పాను. 1977లోనే సూపర్ స్టార్ బిరుదుపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అప్పటికే కమల్ హాసన్ జెమినీ గణేషన్ వంటి వారు స్టార్ హీరోలుగా ఉన్నారు. ఇలా వీరికి కాకుండా అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్లినటువంటి నాకు సూపర్ స్టార్ అని బిరుదు ఇవ్వడంతో తీవ్ర వివాదం చోటుచేసుకుందని ఈ సందర్భంగా రజనీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన జీవితం గురించి ఓ చిన్న కథ కూడా చెప్పారు. అడవిలో ఓ గద్ద, కాకి ఉన్నాయి.

అయితే కాకి గద్దకంటే పైకి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎప్పటికీ గద్దను మించి అది ఎగరలేదన్నది వాస్తవం.అలా నేను కూడా జీవితంలో ఇద్దరికి మాత్రమే భయపడతాను ఒకటి భగవంతుడు రెండు ప్రజలకు మాత్రమే తాను భయపడతానని ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus