Rajinikanth: ఇది తలైవా ఊచకొత..మామూలుగా లేదుగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్. నెల్సన్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 10న విడుదలై.. అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ రోజు నుండే ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది జైలర్ మూవీ. జైలర్ సినిమాలో రజని చెప్పినట్టే.. ఒక రేంజ్ తర్వాత మాటలుండవు.. కోతలే అన్నట్టు వసూళ్లు కూడా అదే రేంజ్ వస్తున్నాయి.

విడుదలైన కేవలం 6 రోజుల్లోనే జైలర్ సినిమా వరల్డ్ వైడ్గా రూ.416 కోట్ల మార్ను టచ్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ లైఫ్ టైమ్ గ్రాస్ రూ.410 కోట్లను ఈజీగా దాటేసింది. విడుదలై ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చాలా చిట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ప్లే అవుతోంది ఈ సినిమా. దీంతో జైలర్ సినిమా కలెక్షన్స్ రోజురోజుకీ ఏ మాత్రం తగ్గడంలేదు.

ఇవన్నీ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో జైలర్ సినిమా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చన జైలర్ సినిమాలో.. తమన్నా, రమ్యకృష్ణ,సునీల్,యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. అంతేకాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్కుమార్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు. ఇక అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus