డ్యాన్స్ చేసే గ్రూప్ లో ఓ మూలాన ఉండే లారెన్స్ .. మన చిరు దయ వల్ల కొరియోగ్రాఫర్ గా, అలాగే నాగార్జున దయ వల్ల డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు లారెన్స్ డైరెక్ట్ చేసే సినిమాకి మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక హీరోగా కూడా బోలెడన్ని హిట్లు లారెన్స్ ఖాతాలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తన సంపాదనలో చాలా వరకూ సేవకే ఖర్చుపెడుతుంటాడు లారెన్స్. దివ్యాంగుల కోసం ట్రస్ట్ లు ఏర్పాటు చెయ్యడంతో పాటు ఎంతో మంది అనాధల్ని చేరదీసాడు. చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీలు కూడా చేయించాడు. అందుకే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ చెయ్యాలి అంటూ కొందరు అతన్ని కోరారట.
ఈ విషయం పై తాజాగా లారెన్స్ స్పందించాడు. దీనికి క్లారిటీ ఇవ్వడమే కాకుండా రజినీ కాంత్ పై కూడా సంచలన కామెంట్లు చేసాడు. తన సోషల్ మీడియా ద్వారా లారెన్స్ స్పందిస్తూ.. “ఎంతో కాలంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, నా శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులు, పలువురు రాజకీయ నాయకులు… నేను రాజకీయాల్లోకి రావాలంటూ కోరుతున్నారు.నేను రాజకీయాల్లోకి వస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వారి నమ్మకం. అలాంటి వారందరికీ ఒక శుభ వార్త చెబుతున్నాను.నేను రజనీకాంత్ గారి పార్టీలో చేరతాను.
అయితే రజనీకాంత్ గారు సీ.ఎం అభ్యర్థిగా నిలబడాలి. రజనీ కాంత్ గారు పార్టీ పెడితే సీఎం అభ్యర్థిగా ఆయన వుండనని చెప్పారు. ఆ స్థానంలో మరొకరిని పెడతానని కూడా చెప్పారు. ఇప్పడు ఆ మాటని ఆయన వెనక్కి తీసుకోవాలి. సీఎం అభ్యర్థిగా రజనీకాంత్ గారు నిలబడితేనే నేను ఆయన పార్టీలో చేరతాను” అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్. ప్రస్తుతం లారెన్స్ కామెంట్స్ తమిళ నాట పెద్ద చర్చకు దారితీసాయి. అంతేకాదు రజినీ కాంత్ అభిమానులను రెచ్చగొట్టి ఆయన్ని ఇరికించినట్టు కూడా అయ్యిందని చెప్పొచ్చు..!
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!