Rajinikanth: మరోసారి అమెరికా వెళ్తోన్న సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజినీకాంత్ కాస్త గ్యాప్ తీసుకొని ఇటీవల మళ్లీ షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరమైనా రజినీ.. ‘అన్నాత్తే’ షూటింగ్ ను మాత్రం రిస్క్ చేసి మరీ పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో చాలా మంది పాల్గొంటున్నారు.

అయితే కొంచెం గ్యాప్ తీసుకొని రజినీ అమెరికా బయలుదేరుతున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు మళ్లీ ఆరోగ్య సమస్యలేమైనా తలెత్తాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతేడాది ఆయన అమెరికా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన అమెరికాకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇండియా నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతో రజినీ ముందుగానే అమెరికా చేరుకుంటున్నట్లు తెలిసింది. మూడు, నాలుగు వారల పాటు అక్కడే ఉండి రెగ్యులర్ చెకప్ లు చేయించుకొని.. అంతా ఓకే అనుకున్న తరువాత ఇండియాకు వస్తారని సమాచారం.

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా విజృభిస్తుండడంతో.. రజినీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన వెంటే ఓ వైద్య బృందాన్ని పెట్టుకొని షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘అన్నాత్తే’ సినిమాను రిలీజ్ చేయాలనే సంకల్పంతో రజినీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన తరువాత ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారని.. ఇప్పట్లో మరో సినిమా చేసే ఆలోచన చేయడం లేదని సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus