‘జబర్దస్త్’ షోతో స్టార్ గా ఎదిగిన గెటప్ శ్రీను (Getup Sreenu)… సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న.. ఇతను హీరోగా కూడా మారి ‘రాజు యాదవ్’ (Raju Yadav) అనే సినిమా చేశాడు. ‘సాయి వరుణవి క్రియేషన్స్’, ‘చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థల పై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది.
మే 24న రిలీజ్ అయిన ‘రాజు యాదవ్’ కి నెగిటివ్ టాక్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా.. ఇదొక వాస్తవిక సంఘటనల నుండి ఆధారం చేసుకుని తీసిన సినిమా అయినప్పటికీ డైరెక్షన్ ఆకట్టుకునే విధంగా లేదు అంటూ క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ అయ్యింది అనే డౌట్ చాలా మందిలో ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. కోటిన్నర బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం అనుకున్న టైంకి రిలీజ్ అవ్వకపోవడంతో నిర్మాతలకి ఇంట్రెస్ట్..లు వంటివి పెరిగిపోవడం..
అలాగే మార్కెటింగ్ ఖర్చులు వంటి వాటితో కలిపి రూ.4.5 కోట్లు అయ్యిందట. థియేటర్ల నుండి రూ.70 లక్షలు షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా ఈ సినిమా బాగానే వెనక్కి రాబట్టినట్లు తెలుస్తుంది. సో నిర్మాతలకి ‘రాజు యాదవ్’ సేఫ్ ప్రాజెక్ట్ అంటున్నారు. బడ్జెట్ హద్దులు దాటకుండా చూసుకుని ఉంటే.. ఇది వారికి లాభాలను కూడా మిగిల్చి ఉండేది.