టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లలో రాకేశ్ మాస్టర్ ఒకరు కాగా రక్త విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన రాకేశ్ మాస్టర్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మృతి చెందగా ఆయన మరణాన్ని మరిచిపోక ముందే రాకేశ్ మాస్టర్ మృతి చెందడం డ్యాన్స్ ను ఇష్టపడే అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. రాకేశ్ మాస్టర్ గతంలో తన మరణం తర్వాత ఏం జరుగుతుందో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నా మరణం తర్వాత శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ పూల మాలలతో వస్తారని కానీ వాళ్లలో బాధతో పోల్చితే సంతోషం ఎక్కువగా ఉంటుందని రాకేశ్ మాస్టర్ అన్నారు. ఆ సమయంలో వాళ్లకు ఏడుపు రాకున్నా బాధ ఉన్నట్టు నటిస్తారని గతంలో నేను వాళ్ల కోసం చేసిన రెండు మంచి మాటల గురించి చెబుతారని రాకేశ్ మాస్టర్ కామెంట్లు చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోదామా అని అనుకుంటారని రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
జానీ మాస్టర్ ఏడవాలని అనుకున్నా కన్నీళ్లు రావని జండూబామ్ తీసుకుని మేనేజ్ చేస్తాడని ఆయన కామెంట్లు చేశారు. నా అంత్యక్రియలు పూర్తైన తర్వాత వాళ్లందరూ రిలాక్స్ అవుతారని రాకేశ్ మాస్టర్ అన్నారు. నా మరణం తర్వాత డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి అందించే విధంగా ముందే ఏర్పాట్లు చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా చేయడం వల్ల నా శిష్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాకేశ్ మాస్టర్ పేర్కొన్నారు.
నా అంత్యక్రియలకు వాళ్లెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చివరకు నా కుమారుడు సైతం నా చితికి నిప్పు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నా అస్తికలను గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదని రాకేశ్ మాస్టర్ తెలిపారు. అందరూ శరీర దానం చేయడం వల్ల మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాకేశ్ మాస్టర్ వెల్లడించడం గమనార్హం.