ఎబౌవ్ యావరేజ్ తో సరిపెట్టుకున్న బెల్లంకొండ ..!

  • May 4, 2022 / 12:41 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ చిత్రం మంచి రివ్యూలను, టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ళ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ మంచి హిట్టొచ్చింది అనే ప్రశంసలు కూడా దక్కాయి. తమిళంలో సూపర్ హిట్టయిన ‘రాట్ససన్’ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కింది  విడుదలయ్యింది. తాజాగా ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు బయటకి వచ్చాయి.

నైజాం 4.63 cr
సీడెడ్ 1.67 cr
వైజాగ్ 2.08 cr
ఈస్ట్ 1.01 cr
వెస్ట్ 0.70 cr
కృష్ణా 0.98 cr
గుంటూరు 1.0 cr
నెల్లూరు 0.37 cr
నైజాం + ఏపీ (టోటల్) 12.44 cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.87 cr
ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 13.72 cr (షేర్)

రాక్షసుడు‘ చిత్రానికి 16 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 13.72 కోట్ల షేర్ ను రాబట్టింది. థియేట్రికల్ 2.28 కోట్ల వరకూ నష్టాల్ని మిగిల్చింది. కొత్త సినిమాలు రావడంతో ‘రాక్షసుడు’ కి దెబ్బ పడిందనే చెప్పాలి. అందులోనూ ప్లాప్ హీరో.. ప్లాప్ డైరెక్టర్ కాంబినేషన్ వల్ల సూపర్ హిట్ టాక్ వచ్చినా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కలేదు. అయితే థియేట్రికల్ పరంగా నష్టాలు వచ్చినప్పటికీ.. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ పరంగా ఈ చిత్రానికి భారీ అమ్మకాలు జరిగాయి కాబట్టి ‘రాక్షసుడు’ చిత్రానికి లాభాల పంట పడింది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus