మొత్తానికి రష్మిక ప్రియుడు క్లారిటీ ఇచ్చాడు..!

సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల పై రూమర్స్ ఎన్నో వస్తుంటాయి. వాటిని వారు ఖండిస్తున్నప్పటికీ.. కొందరు నెటిజన్లు మాత్రం సెటైర్లు వేయడం ఆపరు. రష్మిక మందన విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత ‘గీత గోవిందం’ తో అంతకు మించిన బ్లాక్ బస్టర్ అందుకుని గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు, బన్నీ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు కొట్టేసిన ఈ బ్యూటీకి.. గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే తరువాత రష్మిక ఆ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయం పై రక్షిత్ అభిమానులు.. రష్మిక పై విరుచుకుపడ్డారు. ఇప్పటికీ ఆ విమర్శలు ఆమెకు తప్పడం లేదు. అయితే రక్షిత్ నటించిన ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం తెలుగులో జనవరి 1న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ప్రమోషన్లలో పాల్గొంటున్న రక్షిత్ కు.. రష్మిక తో ఎంగేజ్మెంట్ కు సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆయన బదులిస్తూ.. ‘రష్మిక చాలా పెద్ద కలలు కనింది. ప్రస్తుతం వాటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నిస్తుంది. ఆ కలలు ఎలా పుట్టాయో కూడా నాకు తెలుసు. ఆమె కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో రష్మిక విమర్శించే వారిని కూడా రక్షిత్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేసాడు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus