సీనియర్ హీరోయిన్స్ ని ఫాలో అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్
- June 17, 2017 / 09:29 AM ISTByFilmy Focus
ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ కిరీటాన్ని అందుకోబోతోంది. అంత ఫామ్లో ఉన్న ఈ సుందరి సీనియర్స్ ని ఫాలోఅవుతోంది. సీనియర్స్ అంటే.. 70 , 80 దశకంలో నటించిన తారలు కాదు.. ఆమె కంటే ముందు తెలుగు సినిమాల్లో ఓ ఊపు ఊపినవారు. రకుల్ కంటే ముందు తెలుగులో ఇలియానా, తమన్నా, కాజల్ కథానాయికలుగా ఒక రేంజ్ లో తమ హవాను కొనసాగించారు. చేతినిండా సినిమాలున్న సమయాల్లో బాలీవుడ్ పై కన్నేశారు. అక్కడ ఒక్క సినిమా ఛాన్స్ రాగానే ఇక్కడ సినిమాలు వదిలేసి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లారు.
అయితే విజయాన్ని అందుకోలేక కాజల్, తమన్నా తిరిగి వచేయగా.. ఇలియానా మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూస్తోంది. వీరి కెరీర్ పాఠం చెబుతున్నప్పటికీ రకుల్ బాలీవుడ్ లో ఎంట్రీకి తహ తహ లాడుతోంది. నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ‘ఐయారి’ సినిమా చేస్తోంది. ఈమె అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












