Rakul Preet: కండోమ్స్ టెస్ట్ చేసే పాత్రలో రకుల్.. ఎలా ఉంటుందంటే?

  • March 9, 2022 / 12:48 PM IST

సాధారణంగా టాలీవుడ్లో సక్సెస్ అందుకున్న గ్లామర్ బ్యూటీలు చాలా ఈజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం కొంతమంది హీరోయిన్స్ తెలుగులో సక్సెస్ కాకపోయినా కూడా బాలీవుడ్లో చాలా బిజీగా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. అలాంటి అతికొద్దిమంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. ఈ బ్యూటీకి తెలుగులో మెల్లగా సక్సెస్ రేటు తగ్గిన తర్వాత కూడా బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Click Here To Watch Now

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో నే కాకుండా సౌత్ ఇండస్ట్రీ లో కూడా మంచి అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల కండోమ్స్ బిజినెస్ నేపథ్యంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం ఛత్రివాలి అనే ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా ఇటీవల అనౌన్స్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్ కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలతో కూడా జనాలను ఆకట్టుకోవాలి అని చూస్తోంది. అయితే ఈ బోల్డ్ కంటెంట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమాలో మాత్రం ఎలాంటి బ్యాడ్ కంటెంట్ లేదు అని చాలా ఓపెన్ గా వివరణ ఇచ్చింది. ఒక సాధారణ మహిళలు కండోమ్ కు సంబంధించిన బిజినెస్ లో ఇలాంటి అవకతవకలను చూసింది అనేది సినిమాలోని మేజర్ ప్లస్ పాయింట్ అని తెలిపింది.

అంతేకాకుండా ఈ సినిమాలో కనీసం ఒక ముద్దు సీన్ కూడా ఉండదట. రకుల్ ఈ సినిమాలో కండోమ్ ను టెస్ట్ చేసే ఒక మహిళ పాత్రలో విభిన్నమైన హావభావాలతో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus