Rakul Preet: మొదట నమ్మింది ఆమెనే… ఆమే లేకపోతేనా?: రకుల్‌ ఏం చెప్పిందంటే?

టాలీవుడ్‌లో అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ అయ్యి… ఆ ఫేమ్‌ ఉన్న సమయంలోనే అనూహ్యంగా బాలీవుడ్‌కి వెళ్లిపోయి అక్కడ సెటిలైపోయిన అందం (Rakul Preet) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. సెటిల్‌ అంటే సినిమా విషయంలోనే కాదు.. ఏకంగా పెళ్లి చేసుకుని మరీ పర్సనల్‌ లైఫ్‌లో మరో స్టెప్‌ ఎక్కేసింది. అయితే ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చింది, ఆమె మీద అంత నమ్మకం ఉంచింది ఎవరు? ఈ విషయాల గురించి ఇటీవల చెప్పుకొచ్చింది రకుల్‌. దీంతో ఆ విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

‘రెయిన్‌ బో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్‌ సింగ్‌… ఆ తర్వాత (Sundeep Kishan) సందీప్‌ కిషన్‌ (Venkatadri Express) ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే (Gilli) ‘గిల్లీ’ కన్నడ సినిమాతో వెండితెరకు తొలుత పరియం అయింది. ఆ తర్వాత హిందీలో కూడా ఓ సినిమా చేసింది. అయితే ఆమెకు స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ ఇచ్చింది మాత్రం టాలీవుడ్డే. అలా దశాబ్దకాలం ప్రయాణం పూర్తి చేసుకుంది.

ఇదంతా ఎలా రకుల్‌… ఇంత సాధిస్తావని ముందు నుండి నీకు నమ్మకం ఉందా? అని అడిగితే… మా అమ్మ, నాన్నల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని అసలు సంగతి చెప్పింది. నా ప్రతిభను గుర్తించి, నేను నటించగలనని తొలుత నమ్మింది మా అమ్మ. ఆమె నన్ను బాగా నమ్మింది, నా టాలెంట్‌ను నమ్మింది అని చెప్పింది రకుల్‌. అందుకే కుటుంబ నేపథ్యంతో సంబంధం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం రాలేదని చెప్పింది.

సినిమాల్లోకి వస్తాను అంటే… మా నాన్న కూడా సపోర్ట్‌ చేశారు. అమ్మాయి, అబ్బాయి అనే భేదం చూపించకుండా నన్ను ప్రోత్సహించారు. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, అందులో విజయం సాధించండి అని నాన్న చెప్పేవారు. టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, గోల్ఫ్‌ నేర్పించారు. తల్లిదండ్రుల సపోర్ట్‌తో పాటు కష్ట పడితే ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు అంటూ లైఫ్‌ లెసన్‌ చెప్పింది రకుల్‌.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus