Rakul Preet: తారక్, బన్నీ గురించి రకుల్ క్రేజీ కామెంట్స్.. అదే గొప్ప గౌరవంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నా ఇప్పుడు మాత్రం ఆమె చేతిలో మరీ భారీ ప్రాజెక్ట్ లు లేవు. స్పైడర్ ఫ్లాప్ ఆమె కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని చాలామంది భావిస్తారు. తాజాగా టాలీవుడ్ హీరోల గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)    పుట్టుకతోనే నటుడని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.

Rakul Preet

బన్నీ (Allu Arjun) మంచి యాక్టర్ అని సరైనోడు షూట్ సమయంలో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం తన డ్రీమ్ అని బన్నీ చెప్పారని రకుల్ పేర్కొన్నారు. పుష్ప (Pushpa) మూవీతో బన్నీ నిజంగానే తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడని ఆమె తెలిపారు. తారక్ గొప్ప వ్యక్తి అని పుట్టుకతోనే నటుడు అని తారక్ బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. చరణ్ (Ram Charan) గొప్ప యాక్టర్ అని రకుల్ తెలిపారు.

టాలీవుడ్ స్టార్ హీరోల గురించి రకుల్ గొప్పగా చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సీక్వెల్ సినిమాలలో నటిస్తే రకుల్ కు కెరీర్ పరంగా కలిసిరావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్2 సినిమాతో రకుల్ కు మరో షాక్ తగిలింది.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమె ఖాతాలో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు చేరే అవకాశం అయితే ఉంటుంది. రకుల్ కు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉండగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఆమె నటిస్తే ఈ నటి రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. రకుల్ సోషల్ మీడియా వేదికగా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus