దేశంలో కరోనా ఎలా ఉందో మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కొత్త కేసుల తగ్గుముఖం పడుతోంది. ఈ సమయంలో కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్ చెప్పిన కొన్ని మాటలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతున్నాయి. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న రకుల్.. దేశంలో కరోనా పరిస్థితి, ప్రజలు ఉండాల్సిన తీరు గురించి వివరించింది. ఇంతకీ రకుల్ ఏమందంటే?
దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ మహా విషాదానికి మనం సాక్ష్యంగా నిలవడం బాధాకరం అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది స్నేహితులతో కలసి రకుల్ గురుగావ్‌లోని 600 పేద కుటుంబాలకు సాయం చేసింది. ఇప్పుడు దానిని కొనసాగిస్తూ ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచడం కోసం పాటుపడుతోంది. నిధుల సేకరించి… వాటితో ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్లను సిద్ధం చేస్తోంది రకుల్. ఇంకా మరింతగా ఈ సాయాన్ని అందించాలని చూస్తోంది.
మొదటిసారి దేశంలో లాక్‌డౌన్ పెట్టినప్పుడు అందరం ఆత్మపరిశీలన చేసుకున్నాం. కొన్ని రోజులకు పరిస్థితులు కుదుటపడి లాక్‌డౌన్ ఎత్తేయడంతో సాధారణ జీవితం ప్రారంభించాం. అయితే ఈ సమయంలో మనం ఓ తప్పు చేశాం అనిపిస్తోంది. కరోనా పోయిందనే భావనలో శత్రువును (కరోనాను) మరిచిపోయాం. దీంతో కరోనా మరో రూపం దాల్చి వచ్చి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి అని రకుల్ సూచిస్తోంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!