Rakul Preet: రకుల్‌ ‘కండోమ్‌’ సినిమా టీజర్‌ లుక్‌ చూశారా!

బాలీవుడ్‌కు కాంట్రవర్శీ సినిమాలు పెద్ద కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు కొత్త పాయింట్లను, సమాజంలోని అంశాలను తీసుకొని సినిమా చేస్తుంటారు. ఈ క్రమంలో సమాజంలో చర్చించడానికి కూడా ఇష్టపడని ఎన్నో అంశాలు సినిమాలుగా తెస్తారు. అలా వచ్చినవి కాంట్రవర్శీ అయి కూర్చుకుంటాయి. కొన్ని సినిమాలైతే అనౌన్స్‌మెంట్‌తోనే కాంట్రవర్శీలు అయిపోతాయి. అలాంటి సినిమాల్లో రకుల్‌ ప్రధాన పాత్రలో అనౌన్స్‌ చేసిన కండోమ్‌ టెస్టర్‌ సినిమా. కండోమ్స్‌ టెస్టింగ్‌, వినియోగం తదితర అంశాల నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నామని దర్శకుడు తేజస్‌ ప్రభా విజయ్‌ దియోస్కర్‌ ఆ మధ్య ప్రకటించారు.

దీంతో ‘ఏంటీ… కండోమ్‌ టెస్టర్‌ లాంటి బోల్డ్‌ పాత్ర రకుల్‌ చేస్తుందా?’ అంటూ అందరూ నోళ్లు వెళ్లబెట్టేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఈ సినిమా గురించి ఎక్కడా చర్చ లేదు. దీంతో సినిమా ఆగిపోయిందేమో అని అనుకున్నారు. కానీ ఆ సినిమా టైటిల్‌ను ఇటీవల ప్రకటించారు. సినిమాకు ‘ఛత్రివాలి’ అనే పేరు పెట్టారు. ఓ పెద్ద కండోమ్‌ ప్యాకెట్‌ పట్టుకొని రకుల్‌ పోజు కూడా ఇచ్చింది. దీంతో మరోసారి చర్చల్లో ఈ సినిమా నిలిచింది.

ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది కూడా. ఓ ఉద్యోగం లేని పేదింటి అమ్మాయి, అనుకోని పరిస్థితుల్లో కండోమ్‌ టెస్టర్‌గా మారుతుంది. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జీవిస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎదురయ్యే సందర్భాలే ఈ సినిమా అని సమాచారం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus