Rakul Preet: ఒక దశాబ్దం పూర్తి చేసుకున్న రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్!

కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ క్రమంలోనే ఈమె నటుడు సందీప్ కిషన్ కి జోడిగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే పది సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నటి రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమా గురించి ఇంస్టాగ్రామ్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ… వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా విజయవంతంగా ఒక దశాబ్దం పూర్తి చేసుకుందని తెలిపారు. నా సినీ కెరియర్ లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉందని ఈమె వెల్లడించారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా నాకు సినీ జీవితాన్ని ఇచ్చినటువంటి సినిమా ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ఒక దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా

ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ చేస్తున్నటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తనకు సరైన అవకాశాలు రాకపోవడంతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని ఈమె తెలిపారు. ఇక ప్రస్తుతం రకుల్ సినిమాల విషయానికి వస్తే ఈమె (Rakul Preet) ఇండియన్ 2 సినిమాతో పాటు అయలాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus