ప్రతి రంగంలో మగవారి కంటే ఆడవాళ్ల కష్టానికి తక్కువ విలువ కడతారు. సినీరంగంలో అయితే ఇది కాస్త ఎక్కుగానే ఉంటుంది. ఇటీవల కాలంలో హీరోయిన్ల పారితోషికంపై తరచూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. పలు ఇంటర్వ్యూలో హీరోయిన్లు ఇదే విషయంపై బహిరంగంగా మాట్లాడారు. కథానాయికల పాత్రలతోనూ టికెట్ తెగుతుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిభకు తగ్గ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే! హీరోలతో సమానంగా పని చేసినా వారికి ఎక్కువ, హీరోయిన్లకు తక్కువ అని కొందరు అగ్ర కథానాయికలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఈ పద్థతి మారాలని సూచిస్తున్నారు. తాజాగా పారితోషికం విషయంలో ప్రశ్నించిన జాబితాలో రకుల్ చేరారు. ఇదే విషయంపై ఆమె మాట్లాడారు. ‘‘ఒక సినిమా కోసం నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు. ఒక్కో సందర్భంగా ఇద్దరి కాల్షీట్లు సమానంగా ఉంటాయి. అయినా రెమ్యునరేషన్ విషయంలో తేడా చూపిస్తారు. ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురాగల సత్తా హీరోయిన్‌లకు ఉంటుంది. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమలోని వారు గుర్తించాలి. సినిమాలో మెయిన్ లీడ్స్‌కి సమాన పారితోషికాలు ఇవ్వాలి. హీరోహీరోయిన్‌లకు వేర్వేరుగా ఇవ్వకూడదు.
సినిమాలో క్యారెక్టర్ ఆకట్టుకుందంటే అది ఆ పాత్రకున్న బలం. అందులో ఎవరు నటించారన్నది కాదు’’ అని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు రకుల్. ఇదే వేదికపై ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి రకుల్ మాట్లాడారు. ‘‘ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ లెవల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో ఆమె నటించిన సినిమాలకు అగ్రహీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. నటీనటుల్లో టాలెంట్‌ను చూడాలి కానీ ఇలాంటి భేదం చూపించకూడదు అని అన్నారు.
‘కొండపొలం’ చిత్రం తర్వాత (Rakul Preet) రకుల్ తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు. హిందీలో వరుస అవకాశాలు అందుకొంది. ప్రస్తుతం హిందలో ఓ చిత్రం, తమిళంలో ‘ఇండియన్2’, ‘ఆయలాన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రకులు ప్రీతి సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ ను కొంత మంది హీరోయిన్స్ సపోర్ట్ కూడా చేస్తున్నారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?