Rakul Preet: ఆ టాలీవుడ్ హీరో వల్లే రకుల్ అవకాశాలను కోల్పోయారా?

కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి రకుల్ ప్రీతిసింగ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ ప్రీత్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది.

ఇక తెలుగులో ఈమె చివరిగా మన్మధుడు 2, చెక్,కొండ పొలం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇలా వరుస డిజాస్టర్ సినిమాలు ఎదురు కావడంతో ఈమెకు తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం రకుల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సౌత్ లో తనకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.

ఒక సీనియర్ హీరోతో ముద్దు సీన్లలో నటించడం వల్లే తనకు అవకాశాలు రాలేదని తెలిపారు. ఒక సీనియర్ హీరో సినిమాలో తాను ముద్దు సన్నివేశాలలో నటించడానికి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారని ఈ సినిమా చేసిన తర్వాత తనకు సౌత్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ ఈమె కామెంట్ చేశారు.

ఇక సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో నాగార్జునతో ఈమె (Rakul Preet) చేసిన చిత్రం మన్మధుడు 2 సినిమాలో ముద్దు సన్నివేశాలలో నటించారు. ఈ సినిమా సమయంలో రకుల్ ప్రీతిసింగ్ భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని ఈమె ఈ సందర్భంగా బయటపెట్టారని తెలుస్తోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus